
సినీరంగంలోకి నటిగా అడుగుపెట్టింది. కానీ కెరీర్ మొదట్లోనే ఐరన్ లెగ్ అన్నారు. కట్ చేస్తే.. స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. తక్కువ సమయంలోనే తనదైన ఇంపాక్ట్ చూపించిన ఆమె..నటనలో సూపర్ స్టార్ రజినీకాంత్ కు గట్టి పోటీ ఇచ్చింది. ఒకానొక టైంలో రజినీ యాక్టింగ్, ఫాలోయింగ్ సైతం బీట్ చేసింది. ఇప్పటికీ వరుస సినిమాలతో అలరిస్తుంది. ఆమె మరెవరో కాదు.. హీరోయిన్ రమ్యకృష్ణ. అసలు పేరు అసలు పేరు రమ్య. ఆమె తండ్రి పేరు కృష్ణన్ కావడం వల్ల ఆమె ‘రమ్యకృష్ణ’గా మారారు. ఆమె కేవలం 13 సంవత్సరాల వయసులోనే తమిళ చిత్రం ‘వెళ్లై మనసు’ (వై.జి. మహేంద్రన్ హీరో) ద్వారా సినిమా రంగంలోకి ప్రవేశించారు. కానీ ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు.. ఆ తర్వాత తెలుగులో చేసిన ‘భలే మిత్రులు’ మరికొన్ని సినిమాలు కూడా వరుసగా పరాజయం పాలయ్యాయి. ఆ సమయంలో ఇండస్ట్రీ ఆమెపై ‘ఐరన్ లెగ్’ అనే ముద్ర వేసింది. ఆమె సినిమాల్లో ఉంటే ఆ ప్రాజెక్ట్ ఫ్లాప్ అవుతుందంటూ ప్రచారం జోరుగా సాగింది.. ఒకానొక స్టేజ్ ఫంక్షన్‌లో తనను ఇలా ఐరన్ లెగ్ అనడంపై రమ్యకృష్ణ కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు.
అయితే వరుస ప్లాపులతో ఇండస్ట్రీ ఆమెను పక్కన పెడుతున్న తరుణంలో, దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు ఆమెలోని నటిని, గ్లామర్‌ను గుర్తించారు. ఐరన్ లెగ్ అని ముద్రపడిన నటిని తన సినిమాలో పెట్టుకోవడానికి ఎంతో ధైర్యం కావాలి. రాఘవేంద్రరావు మోహన్ బాబు హీరోగా తీసిన ‘అల్లుడు గారు’ సినిమాలో రమ్యకృష్ణను హీరోయిన్‌గా తీసుకున్నారు. ఆ సినిమా సెన్సేషనల్ హిట్ సాధించింది. ఆ తర్వాత రాజశేఖర్‌తో ఆయన తీసిన ‘అల్లరి ప్రియుడు’ కూడా బ్లాక్‌బస్టర్ అయ్యింది. నిన్నటివరకు ‘ఐరన్ లెగ్’ అన్న నోళ్లే, ఈ విజయాల తర్వాత ఆమెను ‘గోల్డెన్ లెగ్’ అని పిలవడం ప్రారంభించాయి. సక్సెస్ మాత్రమే ఇండస్ట్రీలో మాట్లాడుతుందని దీని ద్వారా మరోసారి నిరూపితమైంది.
రమ్యకృష్ణ కెరీర్‌లో కేవలం గ్లామర్ పాత్రలే కాకుండా నటనకు ప్రాధాన్యమున్న ఎన్నో ఐకానిక్ పాత్రలు ఉన్నాయి: కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘అమ్మోరు’ చిత్రంలో ఆమె అద్భుతమైన దైవిక నటనతో ప్రేక్షకులతో పూజలు అందుకునే స్థాయికి చేరారు. రజనీకాంత్‌కు పోటీగా ‘నరసింహ’ (పడయప్ప) చిత్రంలో ‘నీలాంబరి’ పాత్ర చేయడానికి చాలా మంది టాప్ హీరోయిన్లు భయపడ్డారు. కానీ రమ్యకృష్ణ ఆ అహంకారపూరితమైన పాత్రలో జీవించి, రజనీకాంత్‌తో సమానంగా ప్రశంసలు పొందారు. ఇక బాహుబలి సినిమాలో శివగామమి పాత్రలో రాజమాతగా ఆమె పలికించిన గంభీరత్వం, నటన అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చాయి. ‘చంద్రలేఖ’, ‘అంతఃపురం’ వంటి సినిమాల్లో నటిస్తున్న సమయంలో దర్శకుడు కృష్ణవంశీతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి, ఇద్దరూ వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. ఇప్పటికీ వరుస సినిమాలతో అలరిస్తున్నారు రమ్యకృష్ణ.
ఎక్కువ మంది చదివినవి : Aamir Khan: 61 ఏళ్ల వయసులో మూడో పెళ్లి.. ఆమీర్ ఖాన్ తన మొదటి ఇద్దరు భార్యలకు ఎందుకు విడాకులు ఇచ్చారో తెలుసా.. ?
Ramya Krishna News
ఎక్కువ మంది చదివినవి : Murali Mohan: అన్నయ్య నాకోసం ఫ్యాన్స్ వస్తారా అని అడిగాడు.. ఇప్పుడు ఇండస్ట్రీకే మొగుడయ్యాడు.. మురళి మోహన్..