Tollywood: దీపావళికి సినిమాల జాతర.. థియేటర్లలో, ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు ఇవే..
ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన మ్యాడ్, కీడా కోలా, మా ఊరి పొలిమేర 2 చిత్రాలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. కేవలం థియేటర్లలోనే కాదు.. ఓటీటీల్లోనూ చిన్న సినిమాలకు సూపర్ రెస్పాన్స్ వస్తుంది. ఇక ఇప్పుడు దీపావళి కానుకగా థియేటర్లలో డబ్బింగ్ సినిమాలే ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యాయి. నవంబర్ రెండో వారంలో తెలుగులో చిన్న సినిమాలు రిలీజ్ కాబోతుండడంగా.. డబ్బింగ్ సినిమాలే ఎక్కువగా ఉన్నాయి.
ప్రస్తుతం టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద చిన్న సినిమాలు సత్తా చాటుతున్నాయి. ఈ చిత్రాలకు పోటీనిచ్చేందుకు ఇప్పటివరకు భారీ బడ్జెట్ పెద్ద సినిమాలు లేకపోవడంతో.. ఇప్పుడంతా చిన్న చిత్రాలదే హవా నడుస్తోంది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన మ్యాడ్, కీడా కోలా, మా ఊరి పొలిమేర 2 చిత్రాలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. కేవలం థియేటర్లలోనే కాదు.. ఓటీటీల్లోనూ చిన్న సినిమాలకు సూపర్ రెస్పాన్స్ వస్తుంది. ఇక ఇప్పుడు దీపావళి కానుకగా థియేటర్లలో డబ్బింగ్ సినిమాలే ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యాయి. నవంబర్ రెండో వారంలో తెలుగులో చిన్న సినిమాలు రిలీజ్ కాబోతుండడంగా.. డబ్బింగ్ సినిమాలే ఎక్కువగా ఉన్నాయి. ఇక అటు ఓటీటీల్లోనూ ప్రేక్షకులను అలరించేందుకు కొన్ని సినిమాలు రెడీ అయినట్లు తెలుస్తోంది. దీపావళీ కానుకగా జపాన్, జిగర్తాండ, టైగర్ 3 వంటి చిత్రాలు రిలీజ్ కాబోతున్నాయి. మరో ఇప్పుడు దీపావళీ కానుకగా రాబోతున్న సినిమాలపై ఓ లుక్కేద్దామా.
థియేటర్లలో విడుదలయ్యే సినిమాలు..
జపాన్.. (నటీనటులు: కార్తీ, అను ఇమ్మాన్యుయేల్).. నవంబర్ 10న రిలీజ్..
జిగర్తాండ.. (నటీనటులు: రాఘవ లారెన్స్, ఎస్ జే సూర్య ).. నవంబర్ 10న రిలీజ్..
అలా నిన్ను చేరి. (నటీనటులు: హెబ్బా పటేల్, పాయల్ రాధాకృష్ణ, దినేశ్ తేజ్ ) నవంబర్ 10న రిలీజ్..
ది మార్వెల్స్.. (నటీనటులు: హాలీవుడ్ నటి బ్రీ లార్సన్).. నవంబర్ 10న రిలీజ్..
దీపావళి.. (నటీనటులు: రాము, వెంకట్, దీపన్).. నవంబర్ 11న రిలీజ్..