Tollywood: సంక్రాంతి సూపర్ సక్సెస్.. సమ్మర్ వరకు రాబోతున్న సినిమాల లిస్ట్ ఇదే..

|

Jan 21, 2023 | 7:54 PM

చూస్తుండగానే సంక్రాంతి సీజన్ అయిపోయింది.. అయిపోయి కూడా వారం రోజులు అయిపోయింది. వాటి థియేట్రికల్ రన్‌కు ఇబ్బంది ఉండకుండా.. ఈ వారం సినిమాలేం విడుదల చేయట్లేదు నిర్మాతలు. మరి సంక్రాంతి తీసుకొచ్చిన ఊపు తర్వాత రాబోయే సినిమాలు కంటిన్యూ చేయనున్నాయా.. మళ్లీ ఆ రేంజ్‌లో థియేటర్లకు ప్రేక్షకుల్ని రప్పించే సినిమాలు రావడానికి ఎంత టైమ్ పట్టనుంది..?

Tollywood: సంక్రాంతి సూపర్ సక్సెస్.. సమ్మర్ వరకు రాబోతున్న సినిమాల లిస్ట్ ఇదే..
Tollywood upcoming movie releases
Follow us on

తెలుగు ఇండస్ట్రీకి సంక్రాంతి బాగానే కలిసొచ్చింది. 2017లో ఖైదీ నెం 150, శాతకర్ణి.. 2020లో అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు తర్వాత.. మళ్లీ ఆ స్థాయిలో 2023 పండగ కలెక్షన్లతో కళకళలాడిపోయింది. ఊహించిన దానికంటే ఎక్కువ వసూళ్ళే తీసుకొచ్చాయి వాల్తేరు వీరయ్య, వీరసింహా రెడ్డి . కంటెంట్ యావరేజ్ అయినా.. ఖతర్నాక్ కలెక్షన్లు వచ్చాయి ఈ రెండు సినిమాలకు. చిరంజీవి, బాలయ్య సినిమాలకు దాదాపు 280 కోట్ల గ్రాస్ వచ్చింది.. మరోవైపు విజయ్ వారసుడు కూడా తెలుగులో 25 కోట్ల వరకు గ్రాస్ వసూలు చేసినట్లు ప్రకటించారు నిర్మాత దిల్ రాజు.

మొత్తంగా ఈ సంక్రాంతి సినిమాలు థియేటర్లకు ప్రేక్షకులను బాగానే తీసుకొచ్చాయి. అయితే పండగ తర్వాత రాబోయే సినిమాలు అదే ఊపు కంటిన్యూ చేస్తాయా అంటే మాత్రం అనుమానమే. ఎందుకంటే సమ్మర్ వరకు పెద్ద సినిమాలేం రావట్లేదు. జనవరి 26న సుధీర్ బాబు హంట్, సితార ఎంటర్‌టైన్మెంట్స్ బుట్టబొమ్మ సినిమాలు విడుదల కానున్నాయి. ఇక ఫిబ్రవరిలోనూ సమంత శాకుంతలం, విశ్వక్ సేన్ ధమ్కీ, కళ్యాణ్ రామ్ అమిగోస్, కిరణ్ అబ్బవరం వినరో భాగ్యము విష్ణుకథ లాంటి సినిమాలు వస్తున్నాయి.

కానీ అందులో ఏవి సంక్రాంతి రేంజ్ మ్యాజిక్ చేస్తాయనేది ఆసక్తికరమే. ఎప్రిల్ తర్వాతే భోళా శంక‌ర్‌, రావ‌ణాసుర‌, హరిహర వీర‌మ‌ల్లు, ద‌స‌రా లాంటి భారీ సినిమాలు రానున్నాయి.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి