Tollywood: టాలీవుడ్‏లో రీరిలీజ్ ట్రెండ్.. ఒకేసారి ఎన్ని సినిమాలు విడుదలవుతున్నాయో తెలుసా..?

|

Jul 25, 2024 | 1:43 PM

ఒకప్పటి చిత్రాలను చూసేందుకు ప్రేక్షకులు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుండడంతో రోజు రోజుకు ఈ ట్రెండ్ మరింత పాపులర్ అవుతుంది. కొన్ని రోజుల క్రితం 'పోకిరి', 'వెంకీ', 'తొలి ప్రేమ', 'శివ', 'ఓయ్', 'ఆరెంజ్', 'జల్సా' ఇలా ఎన్నో సినిమాలు రీరిలీజ్ అయ్యాయి. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి బ్లాక్ బస్టర్ మూవీ 'ఇంద్ర' మళ్లీ విడుదలకాబోతుంది. ‘ఇంద్ర’ సినిమా విడుదలై నిన్నటికి 22 ఏళ్లు. అలాగే చిరంజీవి పుట్టిన రోజు ఆగస్టు 22న 'ఇంద్ర' సినిమా మళ్లీ విడుదల కానుంది.

Tollywood: టాలీవుడ్‏లో రీరిలీజ్ ట్రెండ్.. ఒకేసారి ఎన్ని సినిమాలు విడుదలవుతున్నాయో తెలుసా..?
Telugu Movies
Follow us on

తెలుగు చిత్ర పరిశ్రమలో ఇటీవల రీ-రిలీజ్ ట్రెండ్ జోరుగా సాగుతోంది. బ్లాక్ బస్టర్ సినిమాలు ఒకదాని తర్వాత ఒకటి రీరిలీజ్ అవుతున్నాయి. అంతేకాదు ఇప్పుడు కూడా భారీ వసూళ్లు కూడా సాధిస్తున్నాయి. గత కొన్ని నెలలుగా స్టార్స్ పుట్టినరోజు, ప్రత్యేకమైన రోజున పలు చిత్రాలు మళ్లీ అడియన్స్ ముందుకు వచ్చాయి. తెలుగు కల్ట్, బ్లాక్ బస్టర్ చిత్రాలు మళ్లీ విడుదల చేస్తున్నారు మేకర్స్. అలాగే ఒకప్పటి చిత్రాలను చూసేందుకు ప్రేక్షకులు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుండడంతో రోజు రోజుకు ఈ ట్రెండ్ మరింత పాపులర్ అవుతుంది. కొన్ని రోజుల క్రితం ‘పోకిరి’, ‘వెంకీ’, ‘తొలి ప్రేమ’, ‘శివ’, ‘ఓయ్’, ‘ఆరెంజ్’, ‘జల్సా’ ఇలా ఎన్నో సినిమాలు రీరిలీజ్ అయ్యాయి. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి బ్లాక్ బస్టర్ మూవీ ‘ఇంద్ర’ మళ్లీ విడుదలకాబోతుంది. ‘ఇంద్ర’ సినిమా విడుదలై నిన్నటికి 22 ఏళ్లు. అలాగే చిరంజీవి పుట్టిన రోజు ఆగస్టు 22న ‘ఇంద్ర’ సినిమా మళ్లీ విడుదల కానుంది.

ఇప్పుడు జులై 27న రాజమౌళి దర్శకత్వంలో రవితేజ నటించిన ‘విక్రమార్కుడు’ సినిమా మళ్లీ విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో రవితేజకు జోడీగా అనుష్క శెట్టి నటించింది. అలాగే ఆగస్ట్ 2న నాని, సమంత జంటగా నటించిన ప్రేమకథా చిత్రం ‘ఎటో వెళ్లిపోయింది మనసు’ మళ్లీ విడుదల కానుంది. ఈ చిత్రానికి వాసుదేవ్ మీనన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా విడుదలైనప్పుడు బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. అప్పట్లో ప్రేమికులకు బాగా నచ్చిన సినిమా.

మహేష్ బాబు నటించిన రెండు సినిమాలు బ్యాక్ టు బ్యాక్ రీరిలీజ్ కానున్నాయి. మహేష్ బాబు బ్లాక్ బస్టర్ మూవీ ‘ఒక్కడు’ ఆగస్ట్ 8న రీరిలీజ్ కానుంది. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగు చిత్రసీమలో రికార్డులు సృష్టించింది. ఆగస్ట్ 9 మహేష్ బాబు పుట్టినరోజు కాబట్టి ‘మురారి’, ‘ఒక్కడు’ సినిమాలు మళ్లీ విడుదల కానున్నాయి.

తెలుగు చిత్ర పరిశ్రమనే కాకుండా యావత్ భారతీయ చిత్ర పరిశ్రమను ఆశ్చర్యపరిచిన ‘శివ’ చిత్రం ఆగస్టు 29న రీ-రిలీజ్ అవుతోంది. ఈ చిత్రానికి రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించారు. ఈ సినిమా తెలుగు సినిమా కల్ట్ క్లాసిక్ మూవీ. ఈ సినిమాతో రామ్ గోపాల్ వర్మకు భారతీయ చిత్రసీమలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ కొత్త డీసీఎం పవన్ కళ్యాణ్, బ్లాక్ బస్టర్ మూవీ ‘గబ్బర్ సింగ్’ సెప్టెంబర్ 2న రీరిలీజ్ కానున్నాయి. పవన్‌కళ్యాణ్‌తో కలిసి శృతిహాసన్‌ నటించిన ఈ చిత్రం హిందీ చిత్రం ‘దబాంగ్‌’కి రీమేక్‌. ఈ చిత్రానికి హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.