‘మాస్టర్​’ విడుదలకు ప‌ర్మిష‌న్ ఇవ్వొద్దు..సీఎంకు దర్శక‌నిర్మాత‌ కేయార్​ లేఖ‌

|

Jun 05, 2020 | 3:58 PM

త‌మిళ స్టార్ హీరో విజయ్‌ నటించిన తాజా చిత్రం ‘మాస్టర్‌’. ‘ఖైదీ’ ఫేమ్‌ లోకేశ్‌ కనకరాజు  ఈ మూవీ తెర‌కెక్కించారు. విజయ్‌ సేతుపతి మూవీలో మంచి ఇంపార్టెన్స్ ఉన్న పాత్ర‌లో నటించారు. అయితే లాక్‌డౌన్‌ కారణంగా ‘మాస్టర్‌’ సినిమా రిలీజ్ అనూహ్యంగా వాయిదా ప‌డింది. ఇటీవల తమిళనాడు ప్రభుత్వం కొన్ని స‌డ‌లింపులు ఇవ్వ‌డంతో ఈ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జ‌రుగుతున్నాయి. మరోవైపు భౌతిక దూరం స‌హా అన్ని నిబంధనలను పాటిస్తూ జులై నుంచి థియేటర్లు రీ […]

మాస్టర్​ విడుదలకు ప‌ర్మిష‌న్ ఇవ్వొద్దు..సీఎంకు దర్శక‌నిర్మాత‌ కేయార్​ లేఖ‌
Follow us on

త‌మిళ స్టార్ హీరో విజయ్‌ నటించిన తాజా చిత్రం ‘మాస్టర్‌’. ‘ఖైదీ’ ఫేమ్‌ లోకేశ్‌ కనకరాజు  ఈ మూవీ తెర‌కెక్కించారు. విజయ్‌ సేతుపతి మూవీలో మంచి ఇంపార్టెన్స్ ఉన్న పాత్ర‌లో నటించారు. అయితే లాక్‌డౌన్‌ కారణంగా ‘మాస్టర్‌’ సినిమా రిలీజ్ అనూహ్యంగా వాయిదా ప‌డింది. ఇటీవల తమిళనాడు ప్రభుత్వం కొన్ని స‌డ‌లింపులు ఇవ్వ‌డంతో ఈ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జ‌రుగుతున్నాయి. మరోవైపు భౌతిక దూరం స‌హా అన్ని నిబంధనలను పాటిస్తూ జులై నుంచి థియేటర్లు రీ ఓపెనింగ్ చేయ‌డానికి‌ ప్రభుత్వం ప‌ర్మిష‌న్ ఇవ్వ‌నున్నట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో థియేటర్లు ఓపెన్‌ కాగానే ఫ‌స్ట్ మూవీగా ‘మాస్టర్‌’ విడుదల చేయాలని థియేటర్‌ యజమానులు ప్లాన్ చేస్తున్నారు. విజ‌య్ కి భారీ ఫాలోయింగ్ ఉంది కాబ‌ట్టి.. ఈ చిత్ర ప్రదర్శనతో థియేటర్లు ప్రేక్షకులతో కళకళలాడతాయని వారు భావిస్తున్నారు. అయితే  ద‌ర్శ‌క‌నిర్మాత‌ కేయార్‌.. ‘మాస్టర్‌’ విడుదల గురించి సీఎంకు లేఖ రాశారు.

థియేటర్లు స్టార్ట‌యిన‌ వెంటనే మొదటిగా ‘మాస్టర్‌’ చిత్రాన్ని ప్రదర్శించడానికి ప‌ర్మిష‌న్ ఇవ్వొద్ద‌ని కోరారు. ఆ చిత్రాన్ని రిలీజ్ చేస్తే ఎక్కువ మంది ఆడియెన్స్ థియేటర్లకు వస్తారని, దానివల్ల కరోనా వ్యాప్తి చెందే అవ‌కాశం ఉంద‌ని అభిప్రాయపడ్డారు. అదే జరిగితే విజయ్‌కి ఉన్న గుడ్ నేమ్ పోతుందని పేర్కొన్నారు. ఆర్థిక ప‌రిస్థితి కంటే ముందు ప్రజల సంక్షేమం ముఖ్యమని ఆయన వెల్ల‌డించారు. సినీ నిర్మాతలకు విధించే 26 శాతం ఎంట‌ర్టైన్మెంట్ టాక్స్.. రానున్న మూడు నెలలు మాఫీ చేయాలని కోరారు.