Raja Saab Trailer: ఇది అస్సలు ఊహించలేదు.. రాజా సాబ్ ట్రైలర్ మాములుగా లేదుగా..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఇప్పటివరకు వరుస హిట్లతో ప్రేక్షకులను అలరిస్తున్న డార్లింగ్.. ఇప్పుడు చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రభాస్ హీరోగా డైరెక్టర్ మారుతి తెరకెక్కిస్తున్న సినిమా ది రాజాసాబ్. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు.

Raja Saab Trailer: ఇది అస్సలు ఊహించలేదు.. రాజా సాబ్ ట్రైలర్ మాములుగా లేదుగా..
Raja Saab

Updated on: Dec 29, 2025 | 3:39 PM

రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న రాజా సాబ్ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా పై ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ అయ్యింది. ఇటీవలే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించారు. తాజాగా రాజా సాబ్ సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ సినిమా పై అంచనాలను భారీగా పెంచేసింది. ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిధి కుమార్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

ఇక తాజాగా విదులైన ట్రైలర్ అదరగొట్టింది. ప్రభాస్ ఈసినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించనున్నారు. ఇన్నాళ్లు యాక్షన్ సినిమాలతో అలరించిన ప్రభాస్.. ఇప్పుడు ఎంటర్టైనర్ తో రాబోతున్నాడు. ఈ ట్రైలర్ ను యాక్షన్ సీన్స్, హారర్ సీన్స్ తో నింపేశారు. ప్రభాస్ డిఫరెంట్ గెటప్స్ తో కనిపించి ఆకట్టుకున్నాడు.

ఈ ట్రైలర్ పై మీరూ ఓ లుక్కేయండి..

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.