“మీ అంద‌రితో క‌లిసి మూవీ చూసే రోజు కోసం వెయిటింగ్”

|

Jun 13, 2020 | 11:05 PM

నేచురల్‌ స్టార్‌ నాని చేసిన తాజా చిత్రం 'వి' . ఈ మూవీలో నెగ‌టీవ్ షేడ్స్ ఉన్న పాత్ర‌లో న‌టించాడు నాని. తాజాగా ఆ సినిమా నుంచి ఓ స్టిల్‌ను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు. అందులో ఫుల్ రఫ్ లుక్​లో ద‌ర్శ‌న‌మిస్తున్నాడు ఈ హీరో. 'వి' చిత్రం ఫ‌స్ట్ డే షూటింగ్ సమయంలో తీసిన పిక్​ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు.

మీ అంద‌రితో క‌లిసి మూవీ చూసే రోజు కోసం వెయిటింగ్
Follow us on

నేచురల్‌ స్టార్‌ నాని చేసిన తాజా చిత్రం ‘వి’ . ఈ మూవీలో నెగ‌టీవ్ షేడ్స్ ఉన్న పాత్ర‌లో న‌టించాడు నాని. తాజాగా ఆ సినిమా నుంచి ఓ స్టిల్‌ను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు. అందులో ఫుల్ రఫ్ లుక్​లో ద‌ర్శ‌న‌మిస్తున్నాడు ఈ హీరో. ‘వి’ చిత్రం ఫ‌స్ట్ డే షూటింగ్ సమయంలో తీసిన పిక్​ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు.

“మొదటి రోజు షూట్​ లో తీసిన‌ పిక్. మనమందరం కలిసి ఈ మూవీ చూసే రోజు కోసం వేచి చూస్తున్నా. అప్పటి వరకు ఇంట్లోనే సేఫ్ గా ఉండండి”..అని పేర్కొన్నాడు నాని. ఇంద్రగంటి మోహనకృష్ణ తెర‌కెక్కించిన ఈ సినిమాలో  నాని, సుధీర్‌బాబు, అవసరాల శ్రీనివాస్, అదితిరావు హైదరి, నివేదా థామస్‌, జగపతిబాబు,వెన్నెల కిశోర్‌‌ తదితరులు కీల‌క పాత్ర‌లు పోషించారు. కోవిడ్-19 లాక్ డౌన్ కారణంగా ఈ చిత్ర విడుద‌ల‌లో జాప్యం జ‌రుగుతోంది. ప్రభుత్వం థియేటర్లకు ప‌ర్మిష‌న్ ఇవ్వ‌గానే సినిమాను విడుదల చేయాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు మూవీ వ‌ర్గాల స‌మాచారం.