Dhee: ఢీ షో డ్యాన్స్ కొరియోగ్రాఫర్ చైతన్య ఆత్మహత్య.. సూసైడ్‌కు ముందు సెల్ఫీ వీడియో.

|

Apr 30, 2023 | 9:22 PM

యంగ్ అండ్ టాలెంటెడ్ డ్యాన్స్ మాస్టర్ చైతన్య ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇతడు ప్రజంట్ సీజన్‌లో డ్యాన్స్ కొరియోగ్రాఫర్‌గా చేస్తున్నాడు. ఆర్థిక ఇబ్బందులు కారణంగా అతడు సూసైడ్ చేసుకున్నట్లు తెలుస్తుంది. ఆత్మహత్యకు ముందు అతడు సెల్పీ వీడియో తీసుకున్నాడు.

Dhee: ఢీ షో డ్యాన్స్ కొరియోగ్రాఫర్ చైతన్య ఆత్మహత్య.. సూసైడ్‌కు ముందు సెల్ఫీ వీడియో.
Chaitanya Choreographer
Follow us on

తెలుగు టెలివిజన్ ఇండస్ట్రీలో విషాదం నెలకుంది. ప్రముఖ డ్యాన్స్ షో ఢీలో కొరియోగ్రాఫర్‌గా రాణిస్తున్న డ్యాన్స్ మాస్టర్ చైతన్య ఆత్మహత్య చేసుకున్నారు. నెల్లూరులోని  క్లబ్ హోటల్‌లో అతడు సూసైడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆర్థిక ఇబ్బందులే ఇందుకు కారణమని చెబుతున్నారు. కాగా ఆత్మహత్యకు ముందు  చైతన్య సెల్ఫీ వీడియో రికార్డ్ చేశారు. ఈ సందర్భంగా ఈ పని చేస్తున్నందుకు తన తల్లిదండ్రులకు, తన తోటి డ్యాన్స్ మాస్టర్లకు, డ్యాన్సర్లకు సారీ చెప్పాడు చైతన్య. అప్పులు ఇచ్చినవాళ్లు ఇచ్చిన ప్రెజర్ తట్టుకోలేకపోతున్నాని.. చాలా ట్రై చేసినా అవ్వడం లేదని అతడు తెలిపాడు.

ఒక అప్పును పూడ్చుకునేందుకు.. మరో తప్పు.. అలా అప్పులు పెరిగిపోయాయని వెల్లడించాడు. నేమ్, ఫేమ్ ఇచ్చిన ఢీ షోకు ఎప్పుడూ రుణపడి ఉంటానని తెలిపాడు. ఢీ ప్రోగ్రాం లో పేరు వచ్చింది కానీ.. సంపాదన తక్కువగా ఇస్తున్నారనీ.. జబర్దస్త్ ప్రోగ్రాంలో ఎక్కువ మనీ ఇస్తున్నారని.. అతడు సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. డెడ్ బాడీని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యలకు సమాచారం ఇచ్చి.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

కాగా శనివారం నెల్లూరులో కలాంజలి సంస్థ ఆధ్వర్యంలో చైతన్యకు సన్మానం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి, ఎమ్మెల్యే అనిల్ కుమార్ చైతన్యను సన్మానించారు. కాగా నెల్లూరు జిల్లా కావలి మండలం.. మట్టువారిపాలెం.. చైతన్య స్వస్థలం. అతడు మెకానికల్ ఇంజనీరింగ్ చేశాడు. శనివారం అంత యాక్టివ్‌గా కనిపించిన చైతన్య ఒక్క రోజు కూడా గడవకముందే ఆత్మహత్య చేసుకోవడంతో అందరూ షాక్‌కు గురవుతున్నారు.

మరిన్ని  వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.