కాస్టింగ్ కౌచ్‌పై న‌టి తేజస్వి సంచ‌ల‌న కామెంట్స్…

|

Jun 13, 2020 | 9:27 PM

ప్ర‌ముఖ న‌టి తేజస్వి కాస్టింగ్ కౌచ్‌పై సంచ‌ల‌న కామెంట్స్ చేసింది. తన లేటెస్ట్ మూవీ 'కమిట్‌మెంట్' సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్న‌ ఆమె..ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో తాను ఎదుర్కొన్న అనుభ‌వాల‌ను రివీల్ చేసింది. కమిట్‌మెంట్లకు ఓకే చెబితేనే ఇండ‌స్ట్రీలో అవ‌కాశాలు ఇస్తార‌ని.. చిత్ర ప‌రిశ్ర‌మ‌లో 90 శాతం కాస్టింగ్ కౌచ్ ఉందని పేర్కొంది.

కాస్టింగ్ కౌచ్‌పై న‌టి తేజస్వి సంచ‌ల‌న కామెంట్స్...
Follow us on

ప్ర‌ముఖ న‌టి తేజస్వి కాస్టింగ్ కౌచ్‌పై సంచ‌ల‌న కామెంట్స్ చేసింది. తన లేటెస్ట్ మూవీ ‘కమిట్‌మెంట్’ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్న‌ ఆమె..ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో తాను ఎదుర్కొన్న అనుభ‌వాల‌ను రివీల్ చేసింది. కమిట్‌మెంట్లకు ఓకే చెబితేనే ఇండ‌స్ట్రీలో అవ‌కాశాలు ఇస్తార‌ని.. చిత్ర ప‌రిశ్ర‌మ‌లో 90 శాతం కాస్టింగ్ కౌచ్ ఉందని పేర్కొంది. కమిట్‌మెంట్ పేరుతో ఇండస్ట్రీకి కొత్త‌గా వచ్చేవారిని లైంగికంగా లొంగదీసుకుంటున్నారని తెలిపింది. తనను చాలామంది డైరెక్ట్ గా కమిట్‌మెంట్ ఇస్తావా? అని అడిగారని చెప్పింది తేజస్వి. ఇండ‌స్ట్రీలో కమిట్‌మెంట్ అడిగేవారే ఎక్కువ‌మంది ఉన్నారని, వాళ్ల‌ను దాటి వెళ్తేనే అస‌లైన సినిమా వాళ్లు క‌నిపిస్తార‌ని వెల్ల‌డించింది. బాంబే హీరోయిన్స్ ముందే అన్నింటికీ రెడీ అయి ఉంటార‌ని.. అందుకే వారికి అవకాశాలు ఇస్తున్నారని సెన్సేష‌న‌ల్ కామెంట్స్ చేసింది. వారి వ‌ల్ల తెలుగు న‌టీమ‌ణుల‌కు చెడ్డపేరు వస్తోందంటూ ఆవేద‌న వ్య‌క్తం చేసింది.

ఇక ప‌రిశ్ర‌మ‌లో త‌న‌కు తెలిసిన హీరోయిర్లు చాలామంది ఇటువంటి అనుభ‌వాలు ఎదుర్కొన్నార‌ని..కొంత‌మంది ప‌రువు పోతుందని బ‌య‌ట‌కు చెప్ప‌ర‌ని వెల్ల‌డించింది. గ‌తంలో ఓ అబ్బాయితో డేటింగ్ చేశాన‌ని, కాస్టింగ్ కౌచ్ అంశం వల్లే ఆ రిలేషన్‌షిప్ బ్రేక్ అయిందని చెబుతూ కుండ‌బ‌ద్ద‌లు కొట్టింది.