ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటిస్తోన్న కల్కి మూవీపై భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ కోసం అడియన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఈ మూవీ తర్వాత ప్రభాస్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా రాజాసాబ్. ఈ మూవీ అప్డేట్స్ కోసం వేయి కళ్లతో వెయిట్ చేస్తున్నారు. వరుసగా భారీ బడ్జెట్ చిత్రాలతో బిజీగా ఉన్న ప్రభాస్.. అదే సమయంలో సైలెంట్ గా రాజాసాబ్ షూటింగ్ కానిచ్చేస్తున్నారు. హారర్ కామెడీ డ్రామాగా వస్తున్న ఈ మూవీలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇటీవలే ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ ఈ మూవీ సెట్ లో అడుగుపెట్టింది. ఇప్పుడు హైదరాబాద్ లో షూటింగ్ జరుగుతుంది. ఈ షెడ్యూల్ లో ప్రభాస్, నిధి మధ్య ఓ సాంగ్ షూట్ చేయనున్నారని తెలుస్తోంది.
ఓవైపు సైలెంట్ గా షూటింగ్ జరుగుతున్న ఈ సినిమా గురించి నిత్యం సోషల్ మీడియాలో ఏదొక న్యూస్ ట్రెండ్ అవుతుంది. ఈ క్రమంలోనే ఇటీవలే బేబీ మూవీ ప్రొడ్యూసర్ చేసిన ట్వీట్ నెట్టింట తెగ వైరలయ్యింది. మ్యూజిక్ సింబల్స్ పెట్టి ఎస్కేఎన్ ట్వీట్ చేయగా.. దానికి డైరెక్టర్ మారుతీ స్మైల్ సింబల్ ఇచ్చారు. దీంతో రాజాసాబ్ నుంచి త్వరలోనే సాంగ్ రాబోతుందని నెట్టింట ప్రచారం జరిగింది. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పాడు యంగ్ హీరో తేజ. హనుమాన్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న తేజ.. ఇప్పుడు మిరాయ్ మూవీతో రాబోతున్నాడు.
ఈ సినిమా టైటిల్ పోస్టర్, గ్లింప్స్ రిలీజ్ వేడుక హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో జరిగింది. ఈ వేడుకలో ప్రోడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్ కు రాజా సాబ్ మూవీకి సంబంధించిన ప్రశ్నలు ఎదురయ్యాయి. కల్కి మూవీ రిలీజ్ తర్వాత రాజాసాబ్ నుంచి అప్డేట్స్ వస్తాయని అని ప్రొడ్యూసర్ అన్నారు. అదే సమయంలో తేజ మాట్లాడుతూ త్వరలోనే రాజా సాబ్ వస్తుందని డౌట్ గా ఉందండి అంటూ కామెంట్స్ చేశారు. తేజ మాటలకు చిరు నవ్వుతో రిప్లై ఇచ్చారు ప్రొడ్యూసర్. దీంతో త్వరలోనే రాజాసాబ్ సాంగ్ రాబోతుందనే విషయం పై మాత్రం క్లారిటీ వచ్చింది.
Question: Any updates on #Prabhas‘s #TheRajaSaab which has always been the talk of the town?
Producer: We’ll reveal updates post the release of #Kalki2898AD!#TejaSajja: I’m guessing the first song of #TheRajaSaab will drop very very soon!
pic.twitter.com/brMegnZTE7— PrabhasWarriors𝕏 (@PRABHASWARRlORS) April 18, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.