అరుదైన వ్యాధితో బాధపడుతున్న తమన్నా బాయ్ ఫ్రెండ్.. దాని వల్ల జీవితంలో అశాంతి నిండిపోయిందంటూ..

|

Mar 15, 2025 | 1:35 PM

సీనియర్ నటి తమన్నా భాటియా, బాలీవుడ్ ప్రముఖ నటుడు విజయ్ వర్మ వివాహం చేసుకుంటారని అభిమానులు ఆశగా ఎదురు చూశారు. కానీ ఇప్పుడు షాకింగ్ న్యూస్ ఒకటి వినిపిస్తోంది. చాలా కాలంగా డేటింగ్ లో ఉన్న విజయ్ వర్మ, తమన్నా భాటియా ఇప్పుడు విడిపోయారని వార్తలు పుట్టుకొచ్చాయి. అయితే ఈ వార్తల్లో వాస్తవం లేదని తెలుస్తుంది.

అరుదైన వ్యాధితో బాధపడుతున్న తమన్నా బాయ్ ఫ్రెండ్.. దాని వల్ల జీవితంలో అశాంతి నిండిపోయిందంటూ..
Tamanna, Vijay Varma
Follow us on

మిల్కీ బ్యూటీ తమన్నా ఒకానొక సమయంలో టాలీవుడ్‌ను ఏలింది. వరుసగా సినిమాలు చేసి మంచి క్రేజ్ తెచ్చుకుంది ఈ అమ్మడు. తెలుగులో దాదాపు స్టార్ హీరోలందరి సరసన సినిమాలు చేసింది. శ్రీ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ఈ చిన్నది.. హ్యాపీడేస్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమా తర్వాత తెలుగులో బిజీగా మారిపోయింది. తమన్నా ప్రస్తుతం తెలుగులో సినిమాలు తగ్గించింది. హిందీ మీద ఎక్కువ ఫోకస్ పెట్టింది ఈ చిన్నది. తెలుగులో చివరిగా చిరంజీవి హీరోగా నటించిన భోళాశంకర్ సినిమాలో చేసింది. ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఇదిలా ఉంటే తమన్నా త్వరలోనే పెళ్లి పీటలెక్కనుందని వార్తలు వినిపిస్తున్నాయి. తమన్నా విజయ్ వర్మతో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే.

విజయ్ వర్మ ఎవరో కాదు. బాలీవుడ్ నటుడు.. అలాగే నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ఎమ్‌సీఏ సినిమాలో విలన్ గా నటించాడు. అయితే చాలా కాలంగా ప్రేమలో మునిగి తేలుతున్నారు. అయితే ఈ ఇద్దరూ ఈ మధ్య విడిపోయారు అంటూ వార్తలు వచ్చాయి. తమన్నా, విజయ్ వర్మ బ్రేకప్ చేసుకున్నారని రూమర్స్ వినిపించాయి. వాటిలో నిజం లేదు అని అంటున్నారు. ఇదిలా ఉంటే విజయ్ వర్మ ఓ అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడని తెలుస్తుంది.

విజయ్ వర్మ తనకు విటిలిగో అంటే బొల్లి వ్యాధి ఉందని బహిరంగంగానే తెలిపారు. ఈ వ్యాధి కారణంగా తన చర్మం పై తెల్లటి మచ్చలు ఉంటాయని వివరించారు. అలాగే దాని కారణంగా తన లైఫ్ లో అశాంతి నిండిపోయింది అని తెలిపారు. ఇదిలా ఉంటే తమన్నా విజయ్ కలిసి ఓ వెబ్ సిరీస్ లోనూ నటించారు. త్వరలోనే పెళ్లి చేసుకోనున్నారని తెలుస్తుంది. రీసెంట్ గానే ఈ ఇద్దరూ కలిసి హోలీ సెలబ్రేషన్ లో పాల్గొన్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..