జబర్దస్త్‌గా ‘బందోబస్త్’ తెలుగు ట్రైలర్

ఈ మధ్య వరుస ప్లాపులతో సతమతమవుతున్నాడు తమిళ స్టార్ హీరో సూర్య. ఎన్నో ఆశలు పెట్టుకుని శ్రీ రాఘవ దర్శకత్వంలో నటించిన “NGK” మూవీ కూడా తీవ్ర నిరాశనే మిగిల్చింది. తాజాగా కేవీ ఆనంద్ దర్శకత్వంలో ‘కాప్పన్’ అనే తమిళ చిత్రంలో నటించాడు సూర్య. తెలుగులో ఈ చిత్రాన్ని ‘బందోబస్త్’ పేరుతో విడుదల చేస్తున్నారు. మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ ఈ చిత్రంలో దేశ ప్రధానిగా కీలకపాత్రలో నటించారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు […]

జబర్దస్త్‌గా ‘బందోబస్త్’ తెలుగు ట్రైలర్

Updated on: Jul 07, 2019 | 5:55 PM

ఈ మధ్య వరుస ప్లాపులతో సతమతమవుతున్నాడు తమిళ స్టార్ హీరో సూర్య. ఎన్నో ఆశలు పెట్టుకుని శ్రీ రాఘవ దర్శకత్వంలో నటించిన “NGK” మూవీ కూడా తీవ్ర నిరాశనే మిగిల్చింది. తాజాగా కేవీ ఆనంద్ దర్శకత్వంలో ‘కాప్పన్’ అనే తమిళ చిత్రంలో నటించాడు సూర్య. తెలుగులో ఈ చిత్రాన్ని ‘బందోబస్త్’ పేరుతో విడుదల చేస్తున్నారు. మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ ఈ చిత్రంలో దేశ ప్రధానిగా కీలకపాత్రలో నటించారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు టీజర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్.

ఈ టీజర్‌లో సూర్య డిఫరెంట్ లుక్స్‌తో ఆకట్టుకున్నాడు. రైతుగా, సైనికుడిగా, టెర్రరిస్ట్‌గా విభిన్న పాత్రల్లో వైవిధ్యభరిత నటనతో పాటు విభిన్న సంభాషణలతో ఆకట్టుకుంటున్నాడు. ఉగ్రవాదం, సర్జికల్ స్ట్రైక్ నేపథ్యంలో యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మించారు. ఆర్య, బొమన్ ఇరానీ, సాయేషా సైగల్ ఇతర పాత్రల్లో నటించగా.. హరీష్ జయరాజ్ మ్యూజిక్ అందించారు.

Loading...
Unable to load recommendations.
Follow Us