ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ ఏం నడుస్తుంది అంటే.. సెలబ్రిటీల చిన్ననాటి పిక్సే. ఇన్ స్టా, ట్విట్టర్, ఫేస్ బుక్ ఎక్కడ చూసినా వాళ్ల వైరల్ ఫోటోలే కనిపిస్తున్నాయి. వారి ఫ్యాన్స్.. వాటిని నెట్టింట ట్రెండ్ చేస్తున్నారు. ఇప్పుడు మీ ముందుకు ఓ సెలబ్రిటీ చిన్నప్పటి ఫోటోను తీసుకొచ్చాం. ఇతడు బుల్లితెరపై ఓ వెలుగు వెలుగుతున్నాడు. ఎందిరికో నవ్వులు పంచుతున్నాడు. తనదైన టైమింగ్‌తో సెపరేట్ ఫ్యాన్ బేస్ సొంతం చేసుకున్నాడు. సినిమా హీరోగా కూడా రాణిస్తున్నాడు. ఏమైనా ఐడియా వచ్చిందా..? మీకు క్లూ ఏంటి అంటే.. ఇతను మెజిషీయన్గా కెరీర్ స్టార్ట్ చేశాడు.
కనిపెట్టిన వారు గ్రేట్.. ఇప్పటికీ గెస్ చేయనివారి కోసం మేమే చెప్పేస్తున్నాం. ఆ ఫోటోలో ఉన్న చిన్నోడు.. సుడిగాలి సుధీర్. చాలా కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నాడు సుధీర్ ఆనంద్. తొలుత చిన్న చిన్న మ్యాజిక్కులు చేసుకునేవాడు. జబర్దస్త్‌కి వచ్చాక అతని లైఫ్ మారిపోయింది. టాప్ కమెడియన్‌గా ఎదిగాడు. హెస్ట్‌గానూ కొన్ని షోలలో సత్తా చాటాడు. సుధీర్, రష్మీ జోడికి.. బుల్లితెరపై మంచి క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. తొలుత సినిమాల్లో చిన్నా చితక క్యారెక్టర్స్ చేసిన సుధీర్.. ఇప్పుడు హీరోగా ప్రమోట్ అయ్యాడు. ‘సాఫ్ట్వేర్ సుధీర్’, ‘త్రీ మంకీస్’, ‘వాంటెడ్ పండుగాడు’, ‘గాలోడు’, సకాలింగ్ సహస్త్ర’ సినిమాలు చేశాడు. ప్రస్తుతం G.O.A.T అనే మూవీలో నటిస్తున్నాడు. ఈ మూవీలో సుధీర్ సరసన దివ్య భారతి నటిస్తోంది. G.O.A.Tతో తనకు బాగా పేరొస్తుందని సుధీర్ నమ్మకంతో ఉన్నాడు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.