Danush Raayan: ధనుష్ రాయన్ సినిమాకు అరుదైన గౌరవం.. ఏకంగా ఆస్కార్‌కు..

|

Aug 04, 2024 | 1:11 PM

తాజాగా ధనుష్ నటించిన 'రాయన్' సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.  ధనుష్ తన 50వ చిత్రం రాయన్ కు ఆయనే స్వయంగా దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో దుషార విజయన్, సందీప్ కిషన్, కాళిదాస్ జయరామ్, ఎస్.జె.సూర్య, సెల్వరాఘవన్, అపర్ణ బాలమురళి కీలకపాత్రల్లో నటించారు. నార్త్ చెన్నై కథాంశంతో ఈ సినిమా రూపొందింది.

Danush Raayan: ధనుష్ రాయన్ సినిమాకు అరుదైన గౌరవం.. ఏకంగా ఆస్కార్‌కు..
Danush Raayan
Follow us on

స్టార్ హీరో ధనుష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విలక్షణ నటనతో ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు ధనుష్. హిట్స్, ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు ధనుష్. తాజాగా ధనుష్ నటించిన ‘రాయన్’ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.  ధనుష్ తన 50వ చిత్రం రాయన్ కు ఆయనే స్వయంగా దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో దుషార విజయన్, సందీప్ కిషన్, కాళిదాస్ జయరామ్, ఎస్.జె.సూర్య, సెల్వరాఘవన్, అపర్ణ బాలమురళి కీలకపాత్రల్లో నటించారు. నార్త్ చెన్నై కథాంశంతో ఈ సినిమా రూపొందింది. అలాగే ఈ సినిమాలో ధనుష్ ఇప్పటి వరకు ఏ సినిమాలో కనిపించనంత మాస్ అండ్ రగడ్ లుక్ లో కనిపించాడు. ధనుష్‌కి 50వ సినిమా అయిన ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు.

రాయన్ సినిమా విషయానికొస్తే.. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన ధనుష్, గ్రామంలో తమకు భద్రత లేదని గ్రహించి తన ఇద్దరు తమ్ముళ్లు, చెల్లెలితో చెన్నైకి వస్తాడు. ధనుష్ అక్కడ సెల్వరాఘవన్‌ని కలుస్తాడు. అతని సహాయంతో ధనుష్ తన సోదరులు చెల్లెళ్లను చూసుకుంటాడు.  ఎలాంటి సమస్య వచ్చినా వారిని కాపాడేందుకు ధనుష్ కంచుకోటగా వ్యవహరిస్తాడు. ఆతర్వాత ఊహించని విధంగా, అతని మొదటి సోదరుడు సందీప్ కిషన్ ఆ ప్రాంతానికి పెద్దన్న అయిన శరవణన్ కొడుకును చంపేస్తాడు. ఆ తర్వాత నుంచి తమ్ముడిని, కుటుంబాన్ని ధనుష్ ఎలా కాపాడాడు? ఆ తర్వాత ఏం జరిగింది.? అనేది సినిమా కథ. సినిమా కథను దర్శకుడు ధనుష్ ఆసక్తికరంగా మలిచాడు.

ఇక ఈ సినిమా 26న థియేటర్లలో విడుదలై 7 రోజుల్లో బాక్సాఫీస్ వద్ద ఎంత కలెక్ట్ చేసిందనే విషయం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. దీని ప్రకారం సినిమా విడుదలైన 7 రోజులకు ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 102 కోట్లకు పైగా వసూలు చేసి బాక్సాఫీస్ వద్ద రికార్డు సృష్టించింది. ధనుష్ 50వ చిత్రం రాయన్ 7 రోజుల్లో రూ. 100 కోట్ల బాక్సాఫీస్ హిట్ కొట్టడంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాకు మరో అరుదైన గౌరవం దక్కిందని తెలుస్తోంది. ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ లైబ్రరీలో రాయన్ స్క్రీన్ ప్లే శాశ్వతంగా చోటు దక్కించుకుంది. ఈ సినిమా తర్వాత ది వ్యాక్సిన్ వార్, పార్కింగ్ సినిమాలకు కూడా ఇదే గౌరవం దక్కింది. దాంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.