సినిమా ఛాన్స్‌ల పేరుతో మోసం.. లబోధింబోమన్న సోషల్ మీడియా ఇన్ఫులెన్సర్

|

Aug 07, 2024 | 11:18 AM

టిక్ టాక్, ఇన్ స్టా గ్రామ్ ల్లో రీల్ చేసి తమ ప్రతిభను బయట పెట్టుకుంటున్నారు. చాలా మంది ఇలా సోషల్ మీడియా ద్వారా సినిమాల్లోకి అడుగు పెడుతున్నారు. అయితే సినిమా అవకాశాల పేరుతో చాలా మంది మోసం చేస్తూ ఉంటారు. తాజాగా ఓ సోషల్ మీడియా ఇన్ఫులెన్సర్ కూడా సినిమా అవకాశాల పేరుతో మోసపోయింది. సోషల్ మీడియాలో వీడియోలు చేస్తూ పాపులర్ అయిన ఓ యువతిని సినిమా ఛాన్స్ పేరుతో ఓ కేటుగాడు ఆ యువతీ మోసం చేశాడు.

సినిమా ఛాన్స్‌ల పేరుతో మోసం.. లబోధింబోమన్న సోషల్ మీడియా ఇన్ఫులెన్సర్
Nanditha K Shetty
Follow us on

సినిమాల్లో అవకాశాల కోసం చాలామంది సినిమా ఆఫీస్‌ల చుట్టూ తిరుగుతూ కనిపిస్తూ ఉంటారు.హైదరాబాద్‌లో చాలా మంది సినిమా ఆఫర్స్ కోసం కృష్ణానగర్‌లాంటి ఏరియాలో కనిపిస్తూ ఉంటారు. ఇకఇప్పుడు సోషల్ మీడియాలో అందుబాటులోకి వచ్చిన తర్వాత చాలా మంది సినిమాల్లోకి ఈజీగా అడుగుపెడుతున్నారు. టిక్ టాక్, ఇన్ స్టా గ్రామ్ ల్లో రీల్ చేసి తమ ప్రతిభను బయట పెట్టుకుంటున్నారు. చాలా మంది ఇలా సోషల్ మీడియా ద్వారా సినిమాల్లోకి అడుగు పెడుతున్నారు. అయితే సినిమా అవకాశాల పేరుతో చాలా మంది మోసం చేస్తూ ఉంటారు. తాజాగా ఓ సోషల్ మీడియా ఇన్ఫులెన్సర్ కూడా సినిమా అవకాశాల పేరుతో మోసపోయింది. సోషల్ మీడియాలో వీడియోలు చేస్తూ పాపులర్ అయిన ఓ యువతిని సినిమా ఛాన్స్ పేరుతో ఓ కేటుగాడు ఆ యువతీ మోసం చేశాడు. ఏకంగాలక్షరూపాయలకు పైగా అతనికి ముట్టజెప్పింది ఆమె.. ఇంతకూ ఆమె ఎవరంటే..

సోషల్ మీడియాలో వీడియోలు చేస్తూ పాపులర్ అయ్యింది కర్ణాటకకు చెందిన నందితా కే శెట్టి అనే యువతి. తాజాగా ఆ యువతి పోలీసులను ఆశ్రయించింది. మోడలింగ్, రీల్స్ చేస్తూ సినిమా ఆఫర్స్ కోసం చూసే వారిని టార్గెట్ చేసి కొంతమంది మోసం చేస్తూ ఉంటారు. అలాగే ఇప్పుడు నందితా కే శెట్టి అనే యువతికి తమిళ్ లో సినిమా ఛాన్స్ ఇప్పిస్తా అని ఆమెను మోసం చేశాడు సురేష్ అనే కేటుగాడు.

నందిత శెట్టి అనే యువతి మోడల్ గా చేస్తోంది. అలాగే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఈ అమ్మాయి చాలా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఒక మూవీ కాస్టింగ్ కాల్ యాడ్ కనిపించింది. దాంతో ఆమె అది నమ్మి అందులో ఉన్న ఫోన్ నెంబర్ కు కాల్ చేసింది. తనకు సినిమాల్లో ఇంట్రెస్ట్ ఉంది. తనకు సినిమాల్లో నటించాలని ఉన్న విషయాన్ని చెప్పింది. తమిళ్ లో తెరకెక్కుతోన్న హంటర్ మూవీలో ఛాన్స్ ఇప్పిస్తా అని చెప్పాడు. ముందు సినిమా ఛాన్స్ ఇవ్వాలంటే ఆర్టిస్టు కార్డు తీసుకోవాలని చెప్పి రూ. 12500 వసూల్ చేశాడు. ఆతర్వాతమూవీ షూటింగ్ కోసం మలేషియా వెళ్లాల్సి ఉంటుందని టికెట్స్ తీయాలని ఆమెకు, ఆమె తండ్రికి టికెట్స్ తీస్తా అని చెప్పి రూ.90 వేలు కాజేశాడు. ఇలా మొత్తంగా ఆమె దగ్గర రూ. 1.70 లక్షలు వసూల్ చేశాడని పోలీసులకు తెలిపింది నందితా కే శెట్టి. అతను మోసం చేశాడని ఇప్పుడు లబోదిబోమంటుంది నందితా కే శెట్టి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.