“సామజవరగమన” పాట రాసింది నేనెక్కడినే కాదు…

| Edited By:

Jan 06, 2020 | 11:24 PM

స్టైలిష్ స్టార్ బన్నీ, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తోన్న ‘అల.. వైకుంఠపురంలో’ మూవీ.. ఈ నెల 12న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా నగరంలోని యూసుఫ్‌గూడలోని పోలీస్ గ్రౌండ్స్‌లో మ్యూజికల్ నైట్‌ను నిర్వహించింది ఈ సినిమా యూనిట్. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సభ్యులను అభినందించారు ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి. ఇక ఈ మూవీలో సూపర్ డూపర్ హిట్‌ అయిన “సామజవరగమన” సాంగ్ గురించి పలు ఆసక్తికర అంశాలను తెలిపారు. ఈ […]

సామజవరగమన  పాట రాసింది నేనెక్కడినే కాదు...
Follow us on

స్టైలిష్ స్టార్ బన్నీ, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తోన్న ‘అల.. వైకుంఠపురంలో’ మూవీ.. ఈ నెల 12న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా నగరంలోని యూసుఫ్‌గూడలోని పోలీస్ గ్రౌండ్స్‌లో మ్యూజికల్ నైట్‌ను నిర్వహించింది ఈ సినిమా యూనిట్. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సభ్యులను అభినందించారు ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి. ఇక ఈ మూవీలో సూపర్ డూపర్ హిట్‌ అయిన “సామజవరగమన” సాంగ్ గురించి పలు ఆసక్తికర అంశాలను తెలిపారు. ఈ పాట రాసేటప్పుడు తాను అల్లు అర్జున్‌ని అయిపోయాననీ.. అందుకే పాట అంత అందంగా వచ్చిందన్నారు సిరివెన్నెల. ఈ వేడుకకు హాజరైన వారందరికీ.. ఇటీవల వచ్చిన నూతన సంతవ్సరానికి.. రాబోయే సంక్రాంతి పండుగకి శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుక చూస్తుంటే, సూపర్‌ డూపర్‌ హిట్‌ సినిమాలా ఉందని.. త్రివిక్రమ్‌ ఈ సినిమాకు ‘అల వైకుంఠపురములో’ అని మంచి పేరు పెట్టారని అభినందించారు. సరస్వతి కటాక్షం ఎంత వైభవంగా ఉంటుందో, ఎన్ని రూపాలుగా ఉంటుందో, ఎంత వైవిధ్యంగా ఉంటుందో ఈ ఫంక్షన్ చూపిస్తోందన్నారు. సంగీతం, సాహిత్యం, నృత్యం, అభినయం.. ఇలా అనేక రూపాల్లో దర్శనమిచ్చాయన్నారు.

బన్నిని చూస్తుంటే నన్ను నేను మర్చిపోతానని.. అతను డ్యాన్స్‌ చేస్తుంటే.. విద్యుత్ తీగ ఫుల్‌ ఎనర్జీతో ఊగిపోతున్నట్లు ఉంటుందన్నారు. అంతేకాదు.. అన్నిటికంటేమించి బన్నీ చాలా సంస్కారవంతుడని కొనియాడారు. ఇక సామజవరగమన సాంగ్‌ను.. నెటిజన్లు పది మిలియన్లుపైగా విన్నారని.. దీనర్ధం.. సంగీతానికి భాష లేదని.. ఈ పాటను నెటిజన్లు అందరూ మనసు భాషతో వింటున్నారన్నారు. ఇక ‘సామజవరగమన’ పాటను నేను ఒక్కడినే కాదు.. త్రివిక్రమ్‌ కూడా రాశారన్నారు. ఈ పాట రాసేటప్పుడు నేను బన్నీలా అయిపోయానన్నారు. త్రివిక్రమ్‌ ఇచ్చిన ఐడియాతోనే ఈ పాట రాశానని.. దీనికి అందమైన ట్యూన్‌ ఇచ్చిన తమన్‌కు ప్రత్యేక అభినందనలు తెలిపారు. సరస్వతి.. లక్ష్మి ఒక దగ్గర ఉండవని అంటారాని.. కానీ, ఈ సినిమా విడుదలైన తర్వాత రెండూ ఒకే చోట కళకళలాడుతూ ఉంటాయని సిరివెన్నెల సీతారామ శాస్త్రి అన్నారు.