Hyderabad: భాగ్యనగరంలో ఆటోలో ప్రయాణించిన ఈ హీరోయిన్‌ ఎవరో గుర్తుపట్టారా..?

ఫేస్ మాస్క్ పెట్టుకుని.. ఆటోలో ప్రయాణించిన ఈ నవ్వుల రాణి ఎవరో మీరు కనిపెట్టగలరా..?

Hyderabad: భాగ్యనగరంలో ఆటోలో ప్రయాణించిన ఈ హీరోయిన్‌ ఎవరో గుర్తుపట్టారా..?
Tollywood Heroine

Updated on: Sep 02, 2022 | 8:01 AM

Tollywood: ఒకప్పుడు తెలుగునాట టాప్ హీరోయిన్స్‌గా రాణించిన చాలామంది ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా సెటిల్ అయిపోయిన విషయం తెలిసిందే. రమ్యకృష్ణ(Ramya Krishnan), నదియా(Nadhiya), అమలా(Amala), రాశి, ఖుష్బూ ఇలా లిస్ట్‌ చాలా పెద్దగానే ఉంది. కొద్దిమంది మాత్రం పెళ్లిళ్లు చేసుకుని.. ఇండస్ట్రీకి దూరమయ్యారు. కాగా పెళ్లి అనంతరం చాలా గ్యాప్ తీసుకుని.. మళ్లీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. సెకండ్ ఇన్నింగ్స్‌లో సైతం సూపర్‌గా దూసుకెళ్తుతంది సీనియర్ హీరోయిన్ ఇంద్రజ. నైన్టీస్, యర్లీ 2000 సమయంలో పలు భాషల్లో అగ్ర హీరోయిన్‌గా రాణించిన ఇంద్రజ.. పెళ్లి అనంతరం 2007 తర్వాత సిల్వర్ స్క్రీన్‌పై కనిపించలేదు. పాప పుట్టడంతో.. తన బిడ్డ ఆలనా పాలనా చూసుకునేందుకు సినిమాలకు దూరమయ్యింది.  తిరిగి 7 ఏళ్ల గ్యాప్ అనంతరం 2014లో తెలుగు మూవీ దిక్కులు చూడకు రామయ్య సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మంచి సినిమాలే చేసింది. ఈ పాత్రలు పక్కనబెడితే ఆమె ఈటీవీలో వచ్చే పలు కామెడీ షోలు, ఈవెంట్స్‌లో న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తుంది. ఆమె స్మైల్‌కు, జడ్జిమెంట్‌కు వీక్షకులు బాగా కనెక్ట్ అవుతున్నారు. తాజాగా ఆమె హైదరాబాద్‌లో ఆటోలో ప్రయాణించింది. కార్లలో డోర్స్ అన్నీ క్లోజ్ చేసి చాలా ఇబ్బందిగా ఉంటుందని.. ఆటోలో ప్రయాణించండం చాలా ఫ్రీగా ఉందని తెలిపింది. ప్రజంట్ ఆ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Loading...
Unable to load recommendations.
Follow Us