
టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి సుమారు 40 ఏళ్లు అవుతోంది. ఆయన హీరోగా పరిచయమైన సినిమా 1986 మే 23న విడుదలైంది. ఈ 40 ఏళ్లలో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు నాగ్. రొమాంటిక్, యాక్షన్, భక్తిరస సినిమాలు చేసి టాలీవుడ్ లో స్టార్ హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం నాగ్ వయసు 66 ఏళ్లు. అయినా కుర్ర హీరోలకు పోటీ ఇస్తున్నారు. ముఖ్యంగా ఫిట్ నెస్, గ్లామర్ విషయంలో.. ఏమాత్రం తగ్గడంలేదీ సీనియర్ హీరో. ఇప్పటికే తన సినిమా కెరీర్ లో ఎన్నో మైలురాళ్లను అందుకున్న నాగ్ ఇప్పుడు తన 100వ సినిమాతో బిజీగా ఉన్నారు. తమిళ దర్శకుడు రా.కార్తీక్ ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ‘కింగ్ 100’ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో నాగార్జున మరింత స్టైలిష్ గా కనిపిస్తారని సమాచారం. అయితే కింగ్ నాగార్జున కెరీర్ ప్రారంభంలో ఓ స్టార్ హీరోయిన్ ముఖంపై సిగరెట్ పొగ ఊది మరీ ఐలవ్యూ చెప్పాడట. ఆ మధ్యన ఒక ఇంటర్వ్యూలో స్వయంగా ఆ నటినే ఈ విషయాన్ని బయటపెట్టారు. ఆమె మరెవరో కాదు లెజెండరీ నటి షావు కారు జానకి.
నాగార్జున కెరీర్ బిగినింగ్ లో నటించిన సూపర్ హిట్ సినిమాల్లో గీతాంజలి ఒకటి. మణిరత్నం తెరకెక్కించిన ఆల్ టైమ్ క్లాసిక్ లవ్ స్టోరీలో గిరిజ హీరోయిన్ గా నటించింది. అలాగే సీనియర్ నటి షావు కారు జానకి కూడా ఓ కీలక పాత్రలో యాక్ట్ చేశారు. ఈ సినిమాలో భాగంగా గ్రాడ్యుయేషన్ పట్టా అందుకుంటాడు నాగార్జున. ఆ మెడల్ ను అందించే పాత్రలో జానకి కనిపించారు. అయితే సరిగ్గా అదే టైమ్ లో నాగార్జున సిగరెట్ తాగి స్టేజ్ మీదకు వస్తాడు. అప్పుడు ఆ పొగ నోటిలో ఉంటుంది. దాన్ని ఎటు వదలాలో తెలియక.. జానకి ముఖం మీదకు వదిలేస్తాడు. అంతే ఆమె షాక్ అవుతారు. ఆమె తేరుకునే లోపే ఐలవ్యూ చెప్పి కిందకు వెళ్లిపోతాడు. ఒక ఇంటర్వ్యూలో నాగార్జున గురించి అడిగినప్పుడు షావుకారు జానికి ఈ సన్నివేశాన్ని గుర్తు చేసుకున్నారు. గీతాంజలి సినిమా, నాగార్జున నటనపై ప్రశంసలు కురిపించారు.
కాగా 1949 సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు జానకి. కెరీర్ ప్రారంభంలో హీరోయిన్ గా నటించిన ఆమె ఆ తర్వాత సహాయక నటిగా మారిపోయారు. హీరోలు, హీరోయిన్లకు అమ్మగా, అమ్మమ్మగా ఎన్నో అద్భుతమైన పాత్రలను పోషించారు. ప్రస్తుతం ఆమె వయసు 70 ఏళ్లు. దీంతో సినిమాలకు దూరంగా ఉంటున్నారు. అయితే అప్పుడప్పుడూ ఇలా ఇంటర్వ్యూల్లో కనిపిస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.