Sekhar Master: శేఖర్ మాస్టర్‌ కారుకు ప్రమాదం.. వెనుక నుంచి ఢీకొట్టిన లారీ!

శంషాబాద్‌ వద్ద ప్రముఖ కొరియోగ్రాఫర్‌ శేఖర్‌ మాస్టర్‌ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. వెనుక నుంచి వచ్చిన పండ్ల లోడ్‌ లారీ కారును ఢీకొట్టడంతో వాహనం దెబ్బతింది. ఈ ఘటనలో శేఖర్‌ మాస్టర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. పూర్తి వివరాలు కథనంలో ..

Sekhar Master: శేఖర్ మాస్టర్‌ కారుకు ప్రమాదం.. వెనుక నుంచి ఢీకొట్టిన లారీ!
Shekat Master

Updated on: Nov 12, 2026 | 11:29 AM

ప్రముఖ కొరియోగ్రాఫర్‌ శేఖర్‌ మాస్టర్‌ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. హైదరాబాద్‌ శివార్లలోని శంషాబాద్‌ వద్ద నవంబర్‌ 12 తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. కాకా సినిమాలోని స్పెషల్ సాంగ్ షూటింగ్ ముగించుకుని తిరిగి వస్తుండగా ఆయన కారు ప్రమాదానికి గురైంది.

వివరాల్లోకి వెళ్తే.. సాంగ్ షూటింగ్‌ పూర్తి చేసుకున్న అనంతరం శేఖర్‌ మాస్టర్‌ కారులో తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో శంషాబాద్‌ ముచ్చింతల్ సమీపంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన పండ్ల లోడ్‌ లారీ ఆయన కారును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు వెనుక భాగం తీవ్రంగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. శేఖర్‌ మాస్టర్‌కు కూడా స్వల్ప గాయాలు అయినట్లు తెలుస్తోంది.

అనుకోని ఈ ఘటనతో ఆయన అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. తమ అభిమాన కొరియోగ్రాఫర్‌ త్వరగా కోలుకోవాలని సోషల్‌ మీడియా వేదికగా ఆకాంక్షిస్తున్నారు. శేఖర్‌ మాస్టర్‌కు అయిన గాయాల తీవ్రతకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Loading...
Unable to load recommendations.
Follow Us