
సంక్రాంతి సినిమాల సందడి అయిపొయింది. ఈ సంక్రాంతికి థియేటర్స్ లో విడుదలైన సినిమాలు ఇప్పుడు ఓటీటీల్లో విడుదలై అదరగొడుతున్నాయి. థియేటర్స్ లో కోట్ల కలెక్షన్స్ రాబట్టిన సినిమాలు ఇప్పుడు ఓటీటీల్లో మంచి వ్యూస్ ను సొంతం చేసుకుంటున్నాయి. ఒక ఓటీటీల్లో కేవలం తెలుగు సినిమాలే కాదు ఇతర భాషల సినిమాలు కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. కంటెంట్ ఉన్న సినిమాలు ఓటీటీలో చాలానే ఉన్నాయి. ముఖ్యంగా మలయాళం సినిమాలు ఓటీటీలో అదరగొడుతున్నాయి. చిన్న సినిమాలు, కంటెంట్ ఉన్న సినిమాలు ఓటీటీల్లో విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సినిమా కూడా ఓటీటీలో దుమ్మురేపుతోంది. థియేటర్స్ లో విడుదలై ఊహించని విజయాన్ని సాధించిన ఆ సినిమా ఇప్పుడు ఓటీటీలో ట్రెండింగ్ లో దూసుకుపోతుంది. ఇంతకూ ఆ సినిమా ఏంటంటే..
సినిమా పేరు సర్వం మాయ.. నివిన్ పౌలి, రియా శిబు ఈ సినిమాలో జంటగా నటించారు. ఈ సినిమా హారర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో దుమ్మురేపుతోంది. సర్వం మాయ సినిమా థియేటర్స్ లో రూ. 140కోట్లు వసూల్ చేసింది. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో మంచి వ్యూస్ సొంతం చేసుకుంటుంది. బ్రాహ్మణ కుటుంబానికి చెందిన యువకుడు ఓ దెయ్యంతో స్నేహం చేయడం చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది.
బ్రాహ్మణ కుటుంబానికి చెందిన హీరో అనుకోకుండా ఓ దెయ్యంతో స్నేహం చేయాల్సి వస్తుంది. ఆ దెయ్యం ఓ అమ్మాయి.. ఓ పిల్లాడికి శాంతి పూజ చేయడానికి వెళ్లగా ఆ దయ్యం ఆ పిల్లాడిని వదిలి హీరో వెంట వస్తుంది. మొదట భయపడినా ఆతర్వాత దానితో స్నేహం చేస్తాడు. ఆ దెయ్యానికి డెలులు అని పేరు పెడతాడు. తాను ఎందుకు చనిపోయింది.? ఎలా చనిపోయిందో ఆమెకు తెలియదు. ఆ దెయ్యం హీరో జీవితంలోకి వచ్చిన తర్వాత ఏం జరిగింది.? ఆ దెయ్యానికి, హీరోకు ఉన్న సంబంధం ఏంటి అనేది సినిమాలోనే చూడాలి. ఈ జియో హాట్‌స్టార్ వేదికగా స్ట్రీమింగ్ అవుతూ తెలుగుతో పాటు పలు భాషల్లో ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. ఈ సినిమాను అస్సలు మిస్ అవ్వకండి..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.