Samantha: బన్నీ కోసం సమంత యాక్షన్.. ఇండియన్ సిటాడెల్ పోస్టర్ చూశారా ?..

|

Mar 19, 2024 | 5:09 PM

దీంతో ఈ సిరీస్ పై రోజు రోజుకీ మరింత క్యూరియాసిటీ పెరిగింది. అమెరికన్ సిటాడెల్ విడుదలై మంచి రెస్పాన్స్ అందుకోవడంతో.. ఇటు సామ్ నటించిన ఇండియన్ వెర్షన్ పై హైప్ ఏర్పడింది. ఈ సిరీస్ ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా ? అని వెయిట్ చేశారు ఫ్యాన్స్. ఈ క్రమంలోనే తాజాగా సిటాడెల్ స్ట్రీమింగ్ పనులు , ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు మేకర్స్. సిటాడెల్ ఇండియన్ వెర్షన్ త్వరలోనే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి రానుంది.

Samantha: బన్నీ కోసం సమంత యాక్షన్.. ఇండియన్ సిటాడెల్ పోస్టర్ చూశారా ?..
Citadel
Follow us on

హాలీవుడ్‏లో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా నటించిన వెబ్ సిరీస్ సిటాడెల్. దీనికి ఇండియన్ వెర్షన్ తెరకెక్కించారు డైరెక్టర్స్ రాజ్ అండ్ డీకే. ఇందులో బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్, హీరోయిన్ సమంత జంటగా నటించారు. ఈ యాక్షన్ థ్రిల్లింగ్ వెబ్ సిరీస్ షూటింగ్ ఎప్పుడో పూర్తైంది. కానీ ఇప్పటివరకు అటు స్ట్రీమింగ్ డీటెయిల్స్ కానీ.. పోస్టర్స్, గ్లింప్స్, టీజర్ వంటి ఎలాంటి అప్టేడ్స్ రివీల్ చేయలేదు మేకర్స్. దీంతో ఈ సిరీస్ పై రోజు రోజుకీ మరింత క్యూరియాసిటీ పెరిగింది. అమెరికన్ సిటాడెల్ విడుదలై మంచి రెస్పాన్స్ అందుకోవడంతో.. ఇటు సామ్ నటించిన ఇండియన్ వెర్షన్ పై హైప్ ఏర్పడింది. ఈ సిరీస్ ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా ? అని వెయిట్ చేశారు ఫ్యాన్స్. ఈ క్రమంలోనే తాజాగా సిటాడెల్ స్ట్రీమింగ్ పనులు , ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు మేకర్స్. సిటాడెల్ ఇండియన్ వెర్షన్ త్వరలోనే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి రానుంది.

ఈ క్రమంలోనే ఈరోజు ముంబై వేదికగా ప్రైమ్ వీడియో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో సిటాడెల్ సిరీస్ ఫస్ట్ పోస్టర్, టైటిల్ రివీల్ చేశారు మేకర్స్. ఈ యాక్షన్ థ్రిల్లింగ్ సిరీస్ కు సిటాడెల్.. హనీ బన్నీ అని టైటిల్ ఫిక్స్ చేశారు. హానీ పేరు పై సామ్ యాక్షన్ లుక్.. బన్నీ పేరుపై వరుణ్ యాక్షన్ లుక్ రివీల్ చేశారు. అయితే ఈసిరీస్ స్ట్రీమింగ్ ఎప్పటినుంచి అనే విషయాలు మాత్రం తెలియాల్సి ఉంది.

ఇందులో కేకే మేనన్, సిమ్రాన్, సోహామ్ మజుందార్ కీలకపాత్రలు పోషించారు. ఫ్యామిలీ మ్యాన్ 2లో నెగిటివ్ షేడ్స్ ఉన్న రాజీ పాత్రలో అదరగొట్టింది సామ్. ఇక ఇప్పుడు మరోసారి సిటాడెల్ సిరీస్ లో మరోసారి యాక్షన్ రోల్ పోషిస్తుంది. దీనికోసం మార్షల్ ఆర్ట్స్ లోనూ శిక్షణ తీసుకుంది సామ్.1990ల నేపథ్యంలో ఈ సిరీస్ సాగుతుందని తెలుస్తోంది. రుస్సో బ్రదర్స్ నిర్మిస్తున్న ఈ సిరీస్ ఇప్పటికే పలు దేశాల్లో రూపొందిస్తున్నారు. ఈ సిరీస్ తో మరోసారి ఓటీటీ ప్లాట్ ఫాంలో నార్త్, సౌత్ అడియన్స్ ను అలరించనుంది సామ్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.