Salman Khan: సల్మాన్ సినిమాలో బతుకమ్మ ఎత్తిన బుట్టబొమ్మ.. ఆకట్టుకుంటోన్న కిసీకీ భాయ్ కిసీకీ జాన్ టీజర్

|

Jan 26, 2023 | 8:21 AM

ఈ సినిమాలో హీరోయిన్ గా టాలీవుడ్ బుట్టబొమ్మ పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే ఈ సినిమా సీనియర్ హీరో వెంకటేష్ కీలక పాత్రలో నటిస్తున్నారు.

Salman Khan: సల్మాన్ సినిమాలో బతుకమ్మ ఎత్తిన బుట్టబొమ్మ.. ఆకట్టుకుంటోన్న కిసీకీ భాయ్ కిసీకీ జాన్ టీజర్
Salman Khan, Pooja Hegde
Follow us on

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ కిసీ క భాయ్ కిసీ క జాన్ . ఈ సినిమా కోసం సల్మాన్ ఫ్యాన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా టాలీవుడ్ బుట్టబొమ్మ పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే ఈ సినిమా సీనియర్ హీరో వెంకటేష్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీలో వెంకీ, పూజా అన్న చెల్లెళ్లుగా కనిపించనున్నారని తెలుస్తోంది. అలాగే విలన్ గా జగపతిబాబు నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను విడుదల చేశారు. ఈ టీజర్ చాలా ఆసక్తికరంగా ఉంది. ఈ టీజర్ కంప్లీట్ గా యాక్షన్ ఎపిసోడ్స్ తో నింపేశారు. అలాగే ఫైట్స్ సీన్స్ ఆకట్టుకున్నాయి.

అలాగే ఈ టీజర్ లో పూజాహెగ్డే బతుకమ్మ ఎత్తినట్టు చూపించారు. పక్కనే వెంకటేష్ కూడా బతుకమ్మతో నడుచుకుంటూ వస్తోన్న సన్నివేశాన్ని చూపించారు. టీజర్ చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలతో ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకునే సీన్ లతో సినిమా సాగుతుందని టీజర్ చూస్తే అర్థమవుతోంది.

వెంకటేష్ హిందీలో నటించి చాలా కాలం అయ్యింది. ‘అనారి’ తరువాత విక్టరీ వెంకటేష్ నటిస్తున్న బాలీవుడ్ మూవీ ఇది. ఈ సినిమాకు ముందుగా ‘కభీ ఈద్ కభీ దివాలీ’ అనే టైటిల్ ని ఫైనల్ చేశారు. కానీ పలు విమర్శలు రావడంతో కిసీకా  భాయ్ కిసీకా జాన్  గా మార్చారు.