ఒకప్పుడు స్టార్‌డమ్.. ఇప్పుడు సాధారణ జీవితం.. ఆమె బయోపిక్ తీయాలని ఉంది : సాయి రాజేష్

ఒకానొక సమయంలో ఇండస్ట్రీని ఊపేసిన అందాల తార ఆమె.. స్టార్ హీరోలకు మించిన ఫ్యాన్ ఫాలోయింగ్ ఆమె సొంతం. ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది ఈ క్రేజీ నటి.. చాలా సినిమాలో నటించి విపరీతమైన పాపులారిటీ సొంతం చేసుకున్నారు ఆమె..

ఒకప్పుడు స్టార్‌డమ్.. ఇప్పుడు సాధారణ జీవితం.. ఆమె బయోపిక్ తీయాలని ఉంది : సాయి రాజేష్
Sai Rajesh

Updated on: Nov 09, 2026 | 11:54 AM

సినిమా ఇండస్ట్రీలో బయోపిక్ సినిమాలకు ఎప్పుడూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంటున్నాయి. ఇప్పటికే సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, క్రీడాకారుల జీవిత కథల ఆధారంగా ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఆయా వ్యక్తుల జీవితాల్లో ఎదురైన ఒడిదుడుకులు, విజయాలు, వ్యక్తిగత సంఘటనలను వెండితెరపై ఆవిష్కరించిన సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో మరో ఆసక్తికరమైన బయోపిక్ తెరపైకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకప్పుడు దక్షిణాది సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి షకీలా జీవిత కథను సినిమాగా తెరకెక్కించాలనే ఆలోచనలో దర్శకుడు సాయి రాజేష్ ఉన్నట్లు తెలుస్తోంది. బేబీ సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సాయి రాజేష్.. నటి షకీలా జీవిత కథను సినిమాగా తెరకెక్కించాలనే ఆసక్తిని వ్యక్తం చేశారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ప్రస్తావించడంతో షకీలా బయోపిక్‌పై ఆసక్తి మొదలైంది. షకీలా పేరు ఒకప్పుడు దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో మారుమోగిపోయింది. ముఖ్యంగా మలయాళ చిత్ర పరిశ్రమలో ఆమె సినిమాలకు భారీ క్రేజ్ ఉండేది. ఆమె నటించిన సినిమాలు విడుదలవుతున్నాయంటే ఇతర సినిమాల విడుదల తేదీల విషయంలో కూడా నిర్మాతలు ఆలోచించేవారని అప్పట్లో ప్రచారం ఉండేది.

గ్లామర్ పాత్రలతో ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న షకీలా.. తక్కువ సమయంలోనే భారీ అభిమానులను సంపాదించుకున్నారు. ఆమె సినిమాలకు ఉండే ఆదరణతో నిర్మాతలు వరుసగా అవకాశాలు ఇచ్చేవారు. ఒకానొక సమయంలో రోజుకు పలు షిఫ్టుల్లో షూటింగ్స్ చేస్తూ బిజీగా గడిపినట్లు సాయి రాజేష్ గుర్తుచేసుకున్నారు. సాయి రాజేష్ తెరకెక్కించిన కొబ్బరిమట్ట సినిమా సమయంలో షకీలాను దగ్గరగా గమనించే అవకాశం ఆయనకు లభించింది. ఆ సమయంలో ఆమెను ఒక సాధారణ ఆర్టిస్టుగా చూశానని, అయితే గతంలో ఆమె అనుభవించిన స్టార్‌డమ్ గురించి తెలుసుకున్నప్పుడు ఆశ్చర్యం కలిగిందని ఆయన అన్నారు. ఒకప్పుడు సినిమాలతో ఎంతో బిజీగా గడిపిన షకీలా.. ప్రస్తుతం చాలా సాధారణమైన జీవితాన్ని గడుపుతున్నారని సాయి రాజేష్ ఇంటర్వ్యూలో ప్రస్తావించారు. గతంలో ఎంతో పేరు, డబ్బు, అభిమానులను సంపాదించుకున్న ఆమె ప్రస్తుత పరిస్థితులు తనను ఆలోచింపజేశాయని తెలిపారు. షకీలా సినీ ప్రయాణం కేవలం విజయాలు, క్రేజ్‌తోనే సాగలేదు. వ్యక్తిగత జీవితంలోనూ, సినిమా కెరీర్‌లోనూ ఎన్నో అనుభవాలను ఎదుర్కొన్నారు. ఆమె జీవితంలోని తెలియని కోణాలు, ఎదుర్కొన్న సమస్యలు బయోపిక్‌కు ఆసక్తికరమైన అంశాలుగా మారే అవకాశం ఉంది.

సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు ఎంతో పేరు సంపాదించుకున్న వ్యక్తులు కూడా కాలక్రమేణా సాధారణ జీవితానికి పరిమితం కావడం సాయి రాజేష్‌ను ఆలోచింపజేసింది. సెలబ్రిటీల జీవితాలు ఎప్పుడూ ఒకేలా ఉండవని, షకీలా జీవితం అందుకు ఒక ఉదాహరణ అని ఆయన అభిప్రాయపడ్డారు. షకీలా బయోపిక్ తెరకెక్కితే అందులో కేవలం ఆమె సినీ ప్రయాణాన్నే కాకుండా వ్యక్తిగత జీవితంలోని అనుభవాలు, విజయాలు, కష్టాలు కూడా ప్రధానంగా చూపించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఒక నటిగా ఆమె ఎదుర్కొన్న పరిస్థితులు ప్రేక్షకుల్లో భావోద్వేగాలను కలిగించవచ్చు. సాయి రాజేష్ షకీలా బయోపిక్‌పై తన ఆసక్తిని వెల్లడించినప్పటికీ.. ఈ సినిమా ఎప్పుడు ప్రారంభం కానుంది.? ఇందులో షకీలా పాత్రలో ఎవరు నటించనున్నారు.? దర్శకుడు, నిర్మాతలు ఎవరు.? అనే విషయాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

 మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us