Sai Pallavi: ఆ స్టార్ హీరో సరసన సాయి పల్లవి.. మణిరత్నం డైరెక్షన్‏లో కొత్త ప్రేమ కథ.. లుక్ అదిరిపోయింది..

ప్రస్తుతం సౌత్ టూ నార్త్ ఇండస్ట్రీలో మోస్ట్ బిజీ హీరోయిన్ అంటే సాయి పల్లవి అని చెప్పొ్చ్చు. హిట్టు, ప్లాపులతో సంబంధమే లేకుండా వరుస సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తుంది. ఓవైపు మోస్ట్ అవైటెడ్ మూవీ రామాయణం చిత్రంలో నటిస్తున్న ఈ అమ్మడు.. ఇప్పుడు తాజాగా మరో చిత్రాన్ని అనౌన్స్ చేసింది. ఇంతకీ ఈ మూవీలో హీరో ఎవరో తెలుసుకుందామా.

Sai Pallavi: ఆ స్టార్ హీరో సరసన సాయి పల్లవి.. మణిరత్నం డైరెక్షన్‏లో కొత్త ప్రేమ కథ.. లుక్ అదిరిపోయింది..
Sai Pallavi

Updated on: Sep 08, 2026 | 8:31 AM

లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి సినిమాలకు సౌత్ ఇండస్ట్రీలో ఏ స్థాయిలో క్రేజ్ ఉంటుందో చెప్పక్కర్లేదు. అయితే ఈ అమ్మడు పూర్తిగా బాలీవుడ్ పై ఫోకస్ చేసింది. ఇదివరకే అమీర్ ఖాన్ కొడుకుతో కలిసి బాలీవుడ్ తెరంగేట్రం చేసిన ఈ బ్యూటీ.. ఇప్పుడు మోస్ట అవైటెడ్ రామాయణం సినిమాలో నటిస్తుంది. నితీశ్ తివారీ దర్శకత్వంలో రూపొందిస్తున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకున్నాయి. మరోవైపు దక్షిణాదిలోనూ వరుస అవకాశాలు అందుకుంటుంది. తాజాగా ఆమె తన కొత్త సినిమాను అనౌన్స్ చేసింది. లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి, సాయి పల్లవి హీరోహీరోయిన్లుగా ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఎలాంటి హడావిడి లేకుండా సెట్స్ మీదకు వెళ్లిన ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుంది. అయితే కొన్ని రోజులుగా ఈ మూవీ గురించి ప్రచారం జరుగుతుండగా తాజాగా టైటిల్ అనౌన్స్ చేసింది చిత్రయూనిట్.

ఎక్కువమంది చదివినవి : Actor: ఒకప్పుడు కెమిస్ట్‌గా, వాచ్‌మన్‌గా పనిచేసి.. ఇప్పుడు తోపు నటుడు.. 200 కోట్లకు అధిపతి..

ఈ సినిమాకు ఇంజి వెల్లం అనే టైటిల్ ఫిక్స్ చేశారు మేకర్స్. ఈ సందర్భంగా సినిమా నుంచి బ్యూటిపుల్ పోస్టర్ రిలీజ్ చేశారు. తాజాగా విడుదలైన టైటిల్ పోస్టర్ లో సాయి పల్లవి, విజయ్ సేతుపతి ఇద్దరూ వర్షంలో తడుస్తూ ఒకరికొకరు దగ్గరగా కనిపించారు. ఇక పోస్టర్ చూస్తుంటే ఎప్పటిలాగే మణిరత్నం మార్క్ లవ్ అండ్ రొమాంటిక్ డ్రామాగా రాబోతుందని తెలుస్తోంది. ఇందులో సేతుపతి క్లీన్ షేవ్ తో కనిపిస్తుండగా.. సాయి పల్లవి చిరునవ్వులు చిందిస్తున్నారు. ఇది కోల్‌కతా బ్యాక్ డ్రాప్ లో సాగే స్టోరీ అని ప్రచారం నడుస్తుంది.

ఎక్కువమంది చదివినవి : Arjun Sarja : ఆ హీరోయిన్‏ను చాలా మిస్సవుతున్నా.. ఆమె దూరమయ్యాకే అర్థం చేసుకున్న.. అర్జున్ సర్జా..

ఇదెలా ఉంటే ఇంజి వెల్లం అంటే అల్లం బెల్లం అని అర్థం. తెలుగులో టైటిల్ ఇదే ఫిక్స్ చేసేలా కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతుండగా.. వచ్చే ఏడాది జనవరిలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది.

ఎక్కువమంది చదివినవి : Cinema : ఆద్యంతం సస్పెన్స్.. దుమ్మురేపుతున్న కోర్ట్ డ్రామా.. 7 సంవత్సరాలుగా ఓటీటీలో ట్రెండింగ్..

ఇంజి వెల్లం టైటిల్ పోస్టర్..

ఎక్కువమంది చదివినవి : Bigg Boss 10 Telugu : లక్షలు ఇస్తామన్నా వద్దన్నారు.. బిగ్ బాస్ 10 ఆఫర్ రిజెక్ట్ చేసిన సెలబ్రిటీస్ వీళ్లే..

Loading...
Unable to load recommendations.
Follow Us