Rashmika Mandanna: విజయ్ దేవరకొండను చూసి అందుకే భయపడ్డాను.. కానీ.. రష్మిక మందన్నా..

|

Jul 25, 2024 | 10:05 AM

వరుస షూటింగ్స్, యాడ్స్ అంటూ క్షణం తీరిక లేకుండా గడిపేస్తున్న రష్మిక.. టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండను చూసి భయపడిందట. అందుకు గల కారణాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది. తెలుగు సినీ ప్రియులకు ఇష్టమైన జోడీలలో రష్మిక, విజయ్ ముందుంటారు. వీరిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీని ప్రేక్షకులు ఎంతగానో ఇష్టపడుతుంటారు.

Rashmika Mandanna: విజయ్ దేవరకొండను చూసి అందుకే భయపడ్డాను.. కానీ.. రష్మిక మందన్నా..
Rashmika, Vijay
Follow us on

పాన్ ఇండియా ఫిల్మ్ ఇండస్ట్రీలో అత్యంత బిజీగా ఉన్న హీరోయిన్ రష్మిక. తెలుగు, తమిళం, హిందీ ఇలా అన్ని భాషల్లోనూ వరుస ఆఫర్స్ అందుకుంటూ అగ్రకథానాయికగా దూసుకుపోతుంది. పుష్ప సినిమాతో నార్త్‏లో ఎక్కువగా క్రేజ్ సొంతం చేసుకుంది ఈ బ్యూటీ. దీంతో బాలీవుడ్‏లో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులకు మరింత చేరువుతుంది. ఇటీవలే డైరెక్టర్ సందీప్ రెడ్డి దర్శకత్వంలో రణబీర్ కపూర్ నటించిన యానిమల్ సినిమాలో గీతాంజలి పాత్రలో అద్భుతమైన నటనకు ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ తోపాటు పుష్ప 2, గర్ల్ ఫ్రెండ్, రెయిన్ బో చిత్రాల్లో నటిస్తుంది. వరుస షూటింగ్స్, యాడ్స్ అంటూ క్షణం తీరిక లేకుండా గడిపేస్తున్న రష్మిక.. టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండను చూసి భయపడిందట. అందుకు గల కారణాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది. తెలుగు సినీ ప్రియులకు ఇష్టమైన జోడీలలో రష్మిక, విజయ్ ముందుంటారు. వీరిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీని ప్రేక్షకులు ఎంతగానో ఇష్టపడుతుంటారు.

వీరిద్దరి కాంబోలో గీత గోవిందం, డియర్ కామ్రేడ్ వంటి సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి. 2018లో డైరెక్టర్ పరశురామ్ తెరకెక్కించిన గీత గోవిందం సినిమా భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా మంచి వసూళ్లు రాబట్టింది. అటు రష్మికకు తెలుగులో మంచి ఫాలోయింగ్ తీసుకువచ్చిన సినిమా ఇదే. ఈసినిమా తర్వాత విజయ్, రష్మిక జోడి గురించి అనేక రూమర్స్ సోషల్ మీడియాలో హాల్చల్ చేస్తుంటాయి. అయితే వాటిపై ఇప్పటివరకు వీరిద్దరూ స్పందించలేదు. ఇదిలా ఉంటే.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రష్మిక మాట్లాడుతూ.. గీత గోవిందం సినిమా సమయంలో విజయ్ దేవరకొండను చూసి భయపడినట్లు చెప్పుకొచ్చింది.

“కెరీర్ తొలినాళ్లలో కొత్త వ్యక్తులతో మాట్లాడటం అంటే కాస్త బెరుకు. అందుకే గీత గోవిందం సినిమా షూటింగ్ సమయంలో తొలిసారి విజయ్ దేవరకొండతో కలిసి నటించేందుకు భయపడ్డాను. కానీ విజయ్ చాలా కూల్ పర్సన్. అతడు సెట్లో ఉంటే వాతావరణం పాజిటివ్ గా ఉంటుంది. అతడితో కలిసి నటించడం చాలా సులువుగా అనిపిస్తుంది. అందుకే ఆ సినిమా షూటింగ్ చాలా సాఫీగా సాగిపోయింది.” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం రష్మిక చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.