Actress Rashi Khanna: ప్లాన్‌బీ, ప్లాన్‌సీతో రాశీఖన్నా రెడీ.. అక్కడ బిగ్ ప్రాజెక్ట్స్ లైన్‌లో పెట్టిన ఏంజెల్ ఆర్నా

ప్లాన్‌బీనే కాదు.. నా దగ్గర ప్లాన్‌సీ కూడా రెడీ అంటున్నారు ఏంజెల్ ఆర్నా  రాశీఖన్నా. తెలుగులో ఛాన్సులు తగ్గిపొయ్యాయన్న వార్తలకు రాశీఖన్నా ఇస్తున్న స్ట్రెయిట్ రియాక్షన్ ఇది.

Actress Rashi Khanna: ప్లాన్‌బీ, ప్లాన్‌సీతో రాశీఖన్నా రెడీ.. అక్కడ బిగ్ ప్రాజెక్ట్స్ లైన్‌లో పెట్టిన ఏంజెల్ ఆర్నా

Updated on: Jan 26, 2021 | 9:09 PM

ప్లాన్‌బీనే కాదు.. నా దగ్గర ప్లాన్‌సీ కూడా రెడీ అంటున్నారు ఏంజెల్ ఆర్నా  రాశీఖన్నా. తెలుగులో ఛాన్సులు తగ్గిపొయ్యాయన్న వార్తలకు రాశీఖన్నా ఇస్తున్న స్ట్రెయిట్ రియాక్షన్ ఇది. ఎస్.. రాశీ ఇప్పుడు తమిళ్‌లోనే కాదు.. మలయాళంలో కూడా వెరీవెరీ బిజీ కాబోతున్నారట.

2020లో ‘వరల్డ్ ఫేమస్ లవ’ర్‌ తప్ప మరో సినిమా లేదు రాశీ ఖాతాలో. కట్‌చేస్తే.. ట్వంటీ21లో నాలుగు తమిళ్ సినిమాలు పడ్డాయి. నాటోన్లీ తమిళ్.. మలయాళంలో కూడా నా హవా చూడబోతున్నారు అని సిగ్నల్ ఇస్తున్నారు రాశీఖన్నా. ‘అంధాధూన్’ మలయాళ రీమేక్‌లో ప్రిథ్విరాజ్‌కి జోడీగా రాశీ పేరు ఫైనలైంది. హిందీలో రాధికా ఆప్టే చేసిన పాత్రను మలబార్ వెర్షన్‌లో రాశీ చేస్తున్నారన్నమాట. తెలుగు రీమేక్‌లో ఇదే పాత్రను నభానటేష్ టేకప్ చేశారు.

కేరళ ఇండస్ట్రీలో నిలదొక్కుకోడానికి అందాదున్‌ మలయాళ వెర్షన్‌ని ఓ ఛాన్స్‌గా వాడుకోబోతున్నారు రాశీ. అటు.. నార్త్‌ సైడ్ కూడా రాశీ పేరు రీసౌండ్ ఇవ్వబోతోంది. షాహిద్‌కపూర్‌తో కలిసి ఇంటిమేట్ పిక్ పోస్ట్ చేశారు రాశీ. రాజ్ అండ్ డీకే డైరెక్ట్ చేస్తున్న ఒక వెబ్‌సిరీస్‌లో నటిస్తున్నారీమె. సో.. ఈ క్యాలెండర్‌ని మోస్ట్ ఈవెంట్‌ఫుల్‌గా మార్చుకుంటున్నారు రాశీ.

Also Read:

Krack OTT Release: బ్లాక్‌బాస్టర్ ‘క్రాక్’ ఓటీటీ రిలీజ్ డేట్ మారింది.. వచ్చేది ఎప్పుడో తెలుసా ..?

Ravi Teja Birthday: మాస్‌కి కేరాఫ్ అడ్రస్.. ఎనర్జీ లెవల్స్ పీక్స్.. ఈ రోజు రవితేజ బర్త్ డే..

Loading...
Unable to load recommendations.
Follow Us