విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. సాలిడ్ హిట్ కోసం విజయ్ చాలా రోజులగా ఎదురుచూస్తున్నాడు. విజయ్ అర్జున్ రెడ్డిలాంటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. లైగర్ లాంటి భారీ డిజాస్టర్ తర్వాత ఖుషి, ఫ్యామిలీ స్టార్ సినిమాలు చేశాడు. కానీ ఈ సినిమాలు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి. కొంతకాలంగా.. ఈమధ్య సైలెంట్ గా ఉన్నాడు. ఆయన సినిమాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించడం లేదు. ఇటీవల విడుదలైన ‘ది ఫ్యామిలీ స్టార్’ సినిమా హిట్ టాక్ తెచ్చుకోలేకపోయింది. తాజాగా విజయ్ లేటెస్ట్ మూవీ పోస్టర్ రిలీజ్ చేశారు. విజయ్ కెరీర్ లో 12వ సినిమా ఇది. ఈ పోస్టర్లో విజయ్ రగ్డ్గా కనిపిస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 28న థియేటర్లలోకి రానుంది. ఈ సినిమా ఫస్ట్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంది.
విజయ్ దేవరకొండ భారీ బడ్జెట్ చిత్రాలలో కనిపించడం చాలా తక్కువ. ఇంతకుముందు ‘లైగర్’ అనే భారీ బడ్జెట్ సినిమాలో నటించాడు. అయితే ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఇప్పుడు ‘వీడీ 12’గా మరో భారీ బడ్జెట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. రీసెంట్ గా విడుదలైన ఫస్ట్ లుక్‌లో అతని గెటప్ చాలా రగ్గా ఉంది. అయితే విజయ్ దేవరకొండ ఈ ఫోటోపై రష్మిక మందన్న, రాశి ఖాన్ లతోపాటు పలువురు సెలబ్రిటీలు ఫైర్ ఎమోజీని పోస్ట్ చేశారు.
విజయ్ సినిమాకు అందరూ ఆల్ ది బెస్ట్. తాజాగా ఈ సినిమా నుంచి పోస్టర్ లీకైంది. ఈ సినిమాను శ్రీలంకలో చిత్రీకరించారు. ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. విజయ్‌తో భాగ్యశ్రీ బోర్సే జతకట్టనుందని అంటున్నారు. అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. ఈ చిత్రానికి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో ‘జెర్సీ’ సినిమాకు దర్శకత్వం వహించి అందరి దృష్టిని ఆకర్షించాడు గౌతమ్.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.