త‌ప్పులో కాలేశారు…రానాకు​ ఎంగేజ్​మెంట్​ కాలేదు..!

|

May 22, 2020 | 8:41 AM

టాలీవుడ్ హ్యాండ్స‌మ్ హంక్ రానా ద‌గ్గుబాటి రిలేష‌న్షిప్ స్టేష‌స్ మారిపోయింది. త్వర‌లోనే ఈ అజానుభాహుడు మిహీకా బజాజ్ మెడ‌లో మూడు ముళ్లు వేయ‌బోతున్నాడు. త‌న ప్రేమ‌ను పెద్ద‌ల‌ను ఒప్పించి పెళ్లి వ‌ర‌కు తెచ్చుకున్న రానా..లాక్ డౌన్ లోనే ల‌గ్గ‌మెట్టుకున్నాడు. ఈ నేప‌థ్యంలో ఇరు కుటుంబాలు గ‌త‌ బుధవారం హైదరాబాద్‌లో మాట ముచ్చటతో కలిసిపోయాయి. అయితే అదే రోజు రానా నిశ్చితార్థం అయిపోయింద‌ని అంద‌రూ భావించారు. కానీ అక్క‌డే త‌ప్పులో కాలేశారు. రానాకు​ ఎంగేజ్​మెంట్​ కాలేదు.. అది రోకా […]

త‌ప్పులో కాలేశారు...రానాకు​ ఎంగేజ్​మెంట్​ కాలేదు..!
Follow us on

టాలీవుడ్ హ్యాండ్స‌మ్ హంక్ రానా ద‌గ్గుబాటి రిలేష‌న్షిప్ స్టేష‌స్ మారిపోయింది. త్వర‌లోనే ఈ అజానుభాహుడు మిహీకా బజాజ్ మెడ‌లో మూడు ముళ్లు వేయ‌బోతున్నాడు. త‌న ప్రేమ‌ను పెద్ద‌ల‌ను ఒప్పించి పెళ్లి వ‌ర‌కు తెచ్చుకున్న రానా..లాక్ డౌన్ లోనే ల‌గ్గ‌మెట్టుకున్నాడు. ఈ నేప‌థ్యంలో ఇరు కుటుంబాలు గ‌త‌ బుధవారం హైదరాబాద్‌లో మాట ముచ్చటతో కలిసిపోయాయి. అయితే అదే రోజు రానా నిశ్చితార్థం అయిపోయింద‌ని అంద‌రూ భావించారు. కానీ అక్క‌డే త‌ప్పులో కాలేశారు. రానాకు​ ఎంగేజ్​మెంట్​ కాలేదు.. అది రోకా వేడ‌క అని ఆరా తీయ‌గా తెలిసింది.

రానా ఇంట్లో వేడుక సెల‌బ్రేష‌న్స్ గురించి తెలుసుకున్న నాని.. ‘అబ్బాయ్‌… నిశ్చితార్థం ‌ జరిగిందా?’ అంటూ వాట్సప్‌ చేశారు రానాకి. ఆయన కాదు, రోకా వేడుక అని రిప్లై ఇచ్చారు. అవునా, అదేంటి..ఆ వేడుక గురించి ‘గూగుల్‌ చేస్తా’ అంటూ నాని ఫ‌న్నీగా కామెంట్ చేశారు. ఈ సంభాష‌ణ‌ను రానా ఇన్‌స్టా స్టేటస్‌ ద్వారా నెటిజ‌న్ల‌తో పంచుకున్నారు. రానాకు​ ఎంగేజ్​మెంట్​ కాలేద‌ని.. అది రోకా అని..సురేష్ బాబు సైతం క్లారిటీ ఇచ్చారు.

పెళ్లికి ముందు జరిగే శుభ కార్య‌క్రమా‌ల‌లో రోకా ఒకటి. నార్త్ సైడ్ ఈ వేడుక‌ను ఎక్కువ‌గా జ‌రుపుకుంటారు. వధూవరుల ఫ్యామిలీస్ కలిసి ఎంగేజ్​మెంట్, పెళ్లి గురించి వివిధ విష‌యాలు మాట్లాడుకుంటారు. ఒకరికొకరు గిఫ్ట్స్ ఇచ్చి పుచ్చుకుంటారు. ఆ వేడుకలో భాగంగానే దగ్గుబాటి, బజాజ్ ఫ్యామిలీస్‌ కలిశాయి. రానా గురువారం మా రిలేష‌న్ ఇక అఫిషియ‌ల్ అంటూ సోష‌ల్ మీడియాలో ఈ వేడుక‌కు సంబంధించిన ఫొటోల్ని పంచుకున్నారు. త్వరలోనే రానా, మిహీకాల నిశ్చితార్థం వేడుకని జరపి..ఈ ఏడాదిలోనే పెళ్లి జరిపేందుకు రానా తండ్రి డి.సురేష్‌బాబు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.