Double ISMART: డబుల్ కిక్ ఇస్తున్న డబుల్ ఇస్మార్ట్ మేకింగ్ వీడియో.. పూరి ఇరగదీశారుగా.!

|

May 22, 2024 | 4:24 PM

గతంలో పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఇస్మార్ట్ శంకర్ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలో ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ రాబోతుంది డబుల్ ఇస్మార్ట్ అనే టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. రామ్ పోతినేని హీరోగా నటించిన ఇస్మార్ట్ శంకర్ సినిమా భారీ హిట్ అందుకోవడంతో పాటు రామ్ కెరీర్ లోనే బిగెస్ట్ హిట్ గా నిలిచింది.

Double ISMART: డబుల్ కిక్ ఇస్తున్న డబుల్ ఇస్మార్ట్ మేకింగ్ వీడియో.. పూరి ఇరగదీశారుగా.!
Double Ismart
Follow us on

డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వం వచ్చే సినిమాలకు యువతలో మంచి క్రేజ్ ఉంటుంది. యువతకు దగ్గరయ్యే కథలతో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు పూరిజగన్నాథ్. గతంలో పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఇస్మార్ట్ శంకర్ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలో ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ రాబోతుంది డబుల్ ఇస్మార్ట్ అనే టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. రామ్ పోతినేని హీరోగా నటించిన ఇస్మార్ట్ శంకర్ సినిమా భారీ హిట్ అందుకోవడంతో పాటు రామ్ కెరీర్ లోనే బిగెస్ట్ హిట్ గా నిలిచింది. ఇక ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్ సినిమాతో మరోసారి విజయం సాధించాలని చూస్తున్నారు రామ్.

ఇటీవలే ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు. ఇస్మార్ట్ శంకర్ సినిమాలానే డబుల్ ఇస్మార్ సినిమా కూడా మంచి విజయాన్ని సాదిస్తుందని ఫ్యాన్స్ అంటున్నారు. ఇక ఈ టీజర్ చూస్తుంటే ఈసారి పూరిజగన్నాథ్ ప్రేక్షకులను డబుల్ కిక్ ఇచ్చేలా కనిపిస్తున్నారు. ఇక మరోసారి రామ్ తన మాస్ డైలాగ్స్ తో  అదరగొట్టాడు. డబుల్ ఇస్మార్ట్ సినిమాలో కావ్య థాపర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా డబుల్ ఇష్మార్ సినిమా నుంచి మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు.

ఈ మేకింగ్ వీడియో ఇప్పుడు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ వీడియో స్టార్టింగ్ లో పూరిజగన్నాథ్ పాట పాడుతూ కనిపించారు. టీజర్ లానే మేకింగ్ వీడియోకు కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ సినిమాలో ఇస్మార్ట్ శంకర్స్ కు మించి యాక్షన్ సీన్స్ ఉంటాయని తెలుస్తోంది. అలాగే ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ విలన్ గా నటిస్తున్నారు. చివరిగా లైగర్ సినిమాతో భారీ డిజాస్టర్ అందుకున్న పూరిజగన్నాథ్ ఇప్పుడు ఎలాగైనా డబుల్ ఇస్మార్ సినిమాతో హిట్ కొట్టాలని కసి మీద ఉన్నారు. ఆ కసి మొత్తం ఈ మేకింగ్ వీడియోలో కనిపిస్తుంది. ఈ వీడియో పై మీరూ ఓ లుక్కేయండి.

పూరి కనెక్షన్స్ ఇన్ స్టా లేటెస్ట్ పోస్ట్..

పూరి కనెక్షన్స్ ఇన్ స్టా లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.