
ప్రముఖ నిర్మాత, సూపర్ గుడ్ ఫిల్మ్ అధినేత శ్రీ ఆర్ బి చౌదరి కన్నుమూశారు. ఆయన ప్రముఖ తమిళ్ హీరో జీవ తండ్రి. ఓ రోడ్డుప్రమాదంలో ఆయన కన్నుమూశారు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తెరకెక్కించిన ఆర్ బి చౌదరి.. ఎంతో మంది ప్రేక్షకులను మెప్పించారు. తెలుగు, తమిళంతో పాటు వివిధ భాషల్లో దాదాపు 100కి పైగా చిత్రాలను నిర్మించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఓ పని నిమిత్తం రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌కు చెందిన చౌదరి, అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. హాస్పటల్ లో చేర్పించినప్పటికీ ఆయన చికిత్సపొందుతూ కన్నుమూశారు. ఆర్ బి చౌదరి మరణంతో సినీ ఇండస్ట్రీ దిగ్బ్రాంతికి గురయ్యింది. సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆర్ బి చౌదరి మరణంపై పవన్ కళ్యాణ్ స్పందించారు.
ఆర్‌బీ చౌదరి మరణం పట్ల చిరంజీవి, రజినీకాంత్, పవన్ కల్యాణ్, పృథ్వీరాజ్ సుకుమారన్, విశాల్ తమ సంతాపం వ్యక్తం చేశారు. పవన్ స్పందిస్తూ.. “ఆర్ బి చౌదరి గారు మరణం దిగ్భ్రాంతి కలిగించింది. రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీ చౌదరి గారు దుర్మరణం చెందారనే దుర్వార్త నమ్మలేకపోయాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. నేను నటించిన ‘సుస్వాగతం’ చిత్రాన్ని శ్రీ చౌదరి గారు నిర్మించారు. ఘన విజయం సాధించింది. చిత్ర నిర్మాణం, సంబంధిత వ్యాపారంపై సాధికారత ఆయనకి సొంతం. కుటుంబ సమేతంగా చూడదగ్గ కథలను ఎంపిక చేసుకుని, చక్కటి గీతాలు ఉండేలా చిత్రాలు నిర్మించారు. అన్నవరం చిత్రంలోని సిస్టర్ సెంటిమెంట్ కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇటు తెలుగు, అటు తమిళ చిత్ర పరిశ్రమల్లో నిర్మాతగా ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. శ్రీ ఆర్ బి చౌదరి గారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను” అని పవన్ కళ్యాణ్ రాసుకొచ్చారు.
రజినీకాంత్ స్పందిస్తూ.. “నా ప్రియ మిత్రుడు, సూపర్ గుడ్ ఫిల్మ్స్ అధినేత ఆర్.బి. చౌదరి ఒక అగ్రశ్రేణి నిర్మాత. ఒక అద్భుతమైన మానవతావాది. ఆయన లెక్కలేనంత మంది యువ దర్శకులకు అవకాశాలు కల్పించి, చిత్ర ప్రపంచాన్ని సజీవంగా ఉంచారు. ఆయన అకాల మరణ వార్త నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి, ఎంతో బాధకు గురి చేసింది. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను” అని రజినీకాంత్ తెలిపారు.
చిరంజీవి స్పందిస్తూ.. “ప్రముఖ నిర్మాత ఆర్.బి. చౌదరి గారి ఆకస్మిక, విషాదకరమైన మరణ వార్త తీవ్రంగా హృదయ విదారకంగా ఉంది. నాకు ఆయన చాలా సంవత్సరాలుగా తెలుసు. ఇటీవలే సూపర్ గుడ్ ఫిల్మ్స్ వారి నా చిత్రం “గాడ్ ఫాదర్” కోసం ఆయనతో కలిసి పనిచేశాను. ఆయన ఎందరో ప్రతిభావంతులైన దర్శకులు, నటుల కెరీర్‌లను తీర్చిదిద్ది, లెక్కలేనన్ని కథలకు జీవం పోశారు. భారతీయ సినిమాకు ఆయన చేసిన సేవను మాటల్లో వర్ణించలేము. ఈ ఊహించలేని కష్ట సమయంలో ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి, మనోధైర్యం కలగాలని కోరుకుంటున్నాను. అని చిరంజీవి తెలిపారు.
என் அருமை நண்பர் சூப்பர் குட் ஃப்லிம்ஸ் ஆர்.பி. செளத்ரி அவர்கள் தலை சிறந்த தயாரிப்பாளர். அருமையான மனிதர். எத்தனையோ இளம் இயக்குநர்களுக்கு வாய்ப்பளித்து திரையுலகை வாழவைத்தவர்.
அவருடைய அகால மரணச் செய்தி எனக்கு பேரதிர்ச்சியையும், மிகுந்த வேதனையையும் அளிக்கிறது.
அவர்…
— Rajinikanth (@rajinikanth) May 5, 2026
Deeply heartbroken to hear about the sudden and tragic loss of Legendary producer R.B. Choudary garu.
I have known him for many years and was recently associated with him on my film “𝐆𝐨𝐝 𝐅𝐚𝐭𝐡𝐞𝐫” through Super Good Films. He has shaped the careers of many talented… pic.twitter.com/8AXgqF5hew
— Chiranjeevi Konidela (@KChiruTweets) May 5, 2026
Shocking to hear the news of the demise of the most prolific producer #RBChoudhary sir. Unable to digest this news in the midst of shoot. In a Loss of words. Life is so uncertain. One of the biggest production houses in India. May his soul rest in peace. My deepest condolences… pic.twitter.com/MMPl4PedR6
— Vishal (@VishalKOfficial) May 5, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.