Geetu Royal: నాగ్‌‌తో గీతూ ఫోటో.. రీ ఎంట్రీనా!.. పింకీ కామెంట్ అయితే అదుర్స్ అబ్బా

|

Nov 28, 2022 | 1:28 PM

గీతూ నాగార్జునతో దిగిన ఫోటో పెట్టడంతో.. ఆమె రీ ఎంట్రీ ఇస్తుందా అని నెటిజన్స్ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Geetu Royal: నాగ్‌‌తో గీతూ ఫోటో.. రీ ఎంట్రీనా!.. పింకీ కామెంట్ అయితే అదుర్స్ అబ్బా
Priyanka Singh - Geetu Royal - Nagarjuna
Follow us on

బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 ముగింపుకు వచ్చేస్తుంది. ఈ ఆదివారం ఫైమా తక్కువ ఓట్లు వచ్చినా..  ‘ఎవిక్షన్ ఫ్రీ పాస్’తో సేవ్ అయ్యింది. దీంతో రాజ్ బయటకు వచ్చేశాడు. రేవంత్‌ని విన్నర్‌ని చేయడానికి తతంగం అంతా పూర్తయినట్లు వినికిడి. ఆదిరెడ్డి విన్నర్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చాలామంది వీక్షకులు అభిప్రాయపడుతున్నారు. ఇక టాప్-5‌లో ఉంటుందని భావించిన గీతూ రాయల్ మితిమీరిన ఆత్మవిశ్వాసంతో 9వ వారమే బయటకు వచ్చి.. ప్రస్తుతం తన పనులు తాను చేసుకుంటుంది. అప్పుడప్పుడు సోషల్ మీడియా ద్వారా బిగ్ బాస్‌కు సంబంధించిన విశేషాలు పంచుకుంటుంది. తాజాగా ఆమె హోస్ట్ నాగార్జునను కలిసింది. ఇటీవల ఆమె నాగార్జున గురించి అన్న మాటలు రాంగ్‌గా ప్రొజెక్ట్ అయ్యాయి. దీంతో వెళ్లి క్లారిఫికేషన్ ఇచ్చి ఉండవచ్చు.

ఇక ఆ సమయంలో నాగ్‌తో ఓ సెల్ఫీ దిగింది గీతూ రాయల్. ఆ ఫోటోను ఇన్ స్టా పోస్ట్ చేసి.. ‘మీరు నాకు ఎప్పుడూ గొప్ప సపోర్టుగా ఉన్నారు సార్. నేను మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. థ్యాంక్స్ సార్’ అని నాగార్జున గురించి రాసుకొచ్చింది. ఈ ఫోటోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఆమె ఫ్యాన్స్ మళ్లీ లోపలికి వెళ్లాలి అని కోరుతుండగా.. యాంటి ఫ్యాన్స్ మాత్రం బిగ్ బాస్ హౌస్ ఛాయలకు కూడా వెళ్లొద్దు తల్లి అంటున్నారు. అయితే బిగ్ బాస్ 5 కంటెస్టెంట్ ప్రియాంక అలియాస్ పింకీ గీతూ ఫోటోపై ‘తగ్గేదే లే’ అంటూ కామెంట్ పెట్టడం నెటిజన్స్ ఆటెన్షన్ గ్రాబ్ చేసింది.

కాగా ప్రియాంకా కామెంట్‌కు ఫన్నీ వేలో రిప్లై ఇచ్చింది గీతూ. 8 కేజీలు తగ్గా పింకీ అని పేర్కొంది. దీంతో గీతూకి ఇంకా ఆ పిల్లతనం పోలేదు అని కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్స్. కాగా బయటకు వెళ్లాక తన ఫ్రెండ్ ఆదిరెడ్డిగా గట్టిగా సపోర్ట్ చేస్తుంది గీతూ రాయల్.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..