
సలార్ రిలీజ్ కు మరికొన్ని గంటలు మాత్రమే ఉంది.. ఈ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. కేజీఎఫ్ కు మించి సలార్ సినిమాను తెరకెక్కించాడు ప్రశాంత్ నీల్. కేజీఎఫ్ 1,2 సినిమాలు ఎంత పెద్ద విజయం సాధించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన కేజీఎఫ్ సినిమాకు డబుల్ యాక్షన్ తో సలార్ ను తెరకెక్కించాడు ప్రశాంత్. దాంతో సలార్ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఫ్యాన్స్ ప్రభాస్ ను ఎలా చూడాలనుకుంటున్నారో ఈ సినిమాలో అలా ప్రజెంట్ చేయనున్నాడు ప్రశాంత్. ఇప్పటికే సలార్ నుంచి వచ్చిన పోస్టర్ దగ్గర నుంచి ట్రైలర్లు సినిమా పై భారీ బజ్ ను క్రియేట్ చేశాయి.
సలార్ సినిమా నుంచి రెండు ట్రైలర్లు విడుదలయ్యాయి. రెండు ట్రైలర్స్ సినిమా పై అంచనాలను తారాస్థాయికి చేర్చాయి. అలాగే ఓ సాంగ్ కూడా రిలీజ్ చేశారు. ఇక ఇప్పుడు రిలీజ్ డేట్ కు ఒక్కరోజు ముందు అంటే నేడు సెకండ్ సాంగ్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.
మొదటి సాంగ్ లో ఇద్దరు మిత్రల మధ్య స్నేహాన్ని చూపించేలా డిజైన్ చేసిన ప్రశాంత్. సెకండ్ సాంగ్ ను కేవలం ప్రభాస్ క్యారెక్టర్ ను ఎలివేట్ చేస్తూ డిజైన్ చేశారు. ఈ సాంగ్ లో ప్రభాస్ పాత్రను అతని తల్లి ఈశ్వరీరావు శ్రుతిహాసన్ కు వివరిస్తూ చిన్న పిల్లలతో పాట పాడిస్తూ కనిపించింది. ఈ సాంగ్ ప్రేక్షకులను మెప్పిస్తుంది. డిసెంబర్
Victories don’t come from wars…. They come from forgiveness.
Listen to #SalaarSecondSingle 🎵
– https://t.co/JFZUhlXLVV#Prathikadalo (Telugu), #QissonMein (Hindi), #Prathikatheya (Kannada), #Prathikaramo (Malayalam), #PalaKadhaiyill (Tamil)Music by @RaviBasrur 🎶#Salaar… pic.twitter.com/xKPU0a4Ruz
— Salaar (@SalaarTheSaga) December 21, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.