ప్రభాస్ టైటిల్‌ను ఎగరేసుకుపోయిన శర్వానంద్

| Edited By: Pardhasaradhi Peri

Jan 08, 2020 | 3:32 PM

లాస్ట్ టైమ్ ‘సాహో’ లాంటి పాన్ ఇండియా మూవీతో ఆడియెన్స్ ముందుకు వచ్చాడు ప్రభాస్. తాజాగా రాధాకృష్ణ డైరెక్షన్‌లో సినిమా చేస్తోన్నాడు. ఈ సారి పూర్తి స్థాయి రొమాంటిక్ డ్రామాలో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కొంత షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయ్యింది. ఈ సినిమాకు ‘జాన్’ అనే టైటిల్ పెట్టబోతున్నట్టు ప్రచారం జరిగింది. కొంతమంది సినిమావాళ్లు కూడా అదే టైటిల్ అని ఫిక్సయ్యారు కూడా. అయితే శర్వానంద్ వీరికి ఒక్కసారిగా షాక్ ఇచ్చాడు. […]

ప్రభాస్ టైటిల్‌ను ఎగరేసుకుపోయిన శర్వానంద్
Follow us on

లాస్ట్ టైమ్ ‘సాహో’ లాంటి పాన్ ఇండియా మూవీతో ఆడియెన్స్ ముందుకు వచ్చాడు ప్రభాస్. తాజాగా రాధాకృష్ణ డైరెక్షన్‌లో సినిమా చేస్తోన్నాడు. ఈ సారి పూర్తి స్థాయి రొమాంటిక్ డ్రామాలో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కొంత షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయ్యింది. ఈ సినిమాకు ‘జాన్’ అనే టైటిల్ పెట్టబోతున్నట్టు ప్రచారం జరిగింది. కొంతమంది సినిమావాళ్లు కూడా అదే టైటిల్ అని ఫిక్సయ్యారు కూడా. అయితే శర్వానంద్ వీరికి ఒక్కసారిగా షాక్ ఇచ్చాడు.

’96’ మూవీ రీమేక్‌‌గా రానున్న చిత్రానికి  తెలుగులో ‘జాను’ అనే పేరును ఖరారు చేశారు. ఆ నేమ్‌తో ఇటివల ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు. సమంత, శర్వానంద్ ఈ మూవీలో హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. దీంతో ప్రభాష్ సినిమా టైటిల్‌పై కన్ఫూజన్ ఏర్పడింది. వాస్తవానికి సినిమా టైటిల్‌ను ముందగానే రిజిస్టర్ చేయించుకోవాలి. ప్రభాస్ మూవీ స్టార్టయి షూటింగ్ కొంత కంప్లీట్ అయినా కూడా టైటిల్ రిజిస్టర్ చేయుంచలేదంటే..వేరే ఏదో పేరుతో రాబోతున్నారని ఫిలిం సర్కిల్‌లో ప్రచారం జరుగుతోంది. లెట్స్ వెయిట్ సీ.