Saaho: డార్లింగ్ హిట్ కొట్టాడంటూ..ఫ్యాన్స్ పాలాభిషేకం

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్..ఈ నేమ్‌కు తెలుగు సినీ చరిత్రలో ఒక సపరేట్ ఇమేజ్ ఉంది. సినిమా హిట్టైనా, ఫ్లాపైనా ఆయనకున్న ఫ్యాన్ బేస్ ఎప్పటికి చెక్కుచెదరదు. ప్రభాస్‌కి డైహార్డ్ ఫ్యాన్స్ మాత్రమే ఉంటారనడంలో సందేహం లేదు. బాహుబలి మూవీ తర్వాత ప్రభాస్ ఇమేజ్ నేషనల్ వైడ్‌కి పాకింది. ఇంటర్నేషనల్ లెవల్‌లో చాలా కంట్రీస్‌లో బాహుబలి రిలీజ్ అయ్యింది. తాజాగా మన డార్లింగ్  నటించిన ‘సాహో’ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న […]

Saaho: డార్లింగ్ హిట్ కొట్టాడంటూ..ఫ్యాన్స్ పాలాభిషేకం
Saaho Movie Review: The Sum Total Of Prabhas, Shraddha Kapoor's Film Is Zilch

Updated on: Aug 30, 2019 | 3:36 PM

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్..ఈ నేమ్‌కు తెలుగు సినీ చరిత్రలో ఒక సపరేట్ ఇమేజ్ ఉంది. సినిమా హిట్టైనా, ఫ్లాపైనా ఆయనకున్న ఫ్యాన్ బేస్ ఎప్పటికి చెక్కుచెదరదు. ప్రభాస్‌కి డైహార్డ్ ఫ్యాన్స్ మాత్రమే ఉంటారనడంలో సందేహం లేదు. బాహుబలి మూవీ తర్వాత ప్రభాస్ ఇమేజ్ నేషనల్ వైడ్‌కి పాకింది. ఇంటర్నేషనల్ లెవల్‌లో చాలా కంట్రీస్‌లో బాహుబలి రిలీజ్ అయ్యింది. తాజాగా మన డార్లింగ్  నటించిన ‘సాహో’ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న చాలా థియేటర్ల వద్ద సాహో అభిమానులు సందడి చేస్తున్నారు. థియేటర్ల వద్ద అభిమానులు ప్రభాస్‌ భారీ కటౌట్లను ఏర్పాటు చేశారు. శుక్రవారం తెల్లవారుజాము నుంచే థియేటర్ల వద్దకు చేరుకున్న అభిమానులు ప్రభాస్‌ కటౌట్లకు పాలాభిషేకం చేస్తున్నారు. అంతేకాకుండా థియేటర్ల ముందు తీన్‌మార్‌ డ్యాన్స్‌లతో సందడి చేస్తున్నారు. దాదాపు రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో ‘సాహో’ తెరకెక్కింది. సుజిత్‌ తెరకెక్కించిన ఈ చిత్రంలో ప్రభాస్‌కు జోడీగా బాలీవుడ్‌ తార శ్రద్ధాకపూర్‌ నటించారు. యూవీ క్రియేషన్స్‌ పతాకంపై వంశీ, ప్రమోద్‌ ఈ సినిమా నిర్మించారు.

Loading...
Unable to load recommendations.
Follow Us