పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1 రిలీజ్ అప్పుడేనా !

|

Sep 17, 2020 | 6:50 PM

కరోనా వ్యాప్తి కారణంగా దర్శకుడు మణిరత్నం తన డ్రీమ్ ప్రాజెక్ట్ పొన్నీయిన్ సెల్వన్ షూటింగ్ నిలిపివేసిన సంగతి తెలిసిందే. తిరిగి ఏడు నెలలు విరామం తర్వాత త్వరలో చిత్రీకరణ పున:ప్రారంభం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సినిమాని  రెండు భాగాలుగా విడుదల చేస్తామని ఇటీవల చిత్ర వర్గాలు తెలిపాయి. కాగా ఫస్ట్ పార్ట్  2021 దీపావళికి విడుదల  చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని సమాచారం. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ శ్రీలంకలో ఈ సినిమా షూటింగ్‌ను తిరిగి ప్రారంభించాలని […]

పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1 రిలీజ్ అప్పుడేనా !
Follow us on

కరోనా వ్యాప్తి కారణంగా దర్శకుడు మణిరత్నం తన డ్రీమ్ ప్రాజెక్ట్ పొన్నీయిన్ సెల్వన్ షూటింగ్ నిలిపివేసిన సంగతి తెలిసిందే. తిరిగి ఏడు నెలలు విరామం తర్వాత త్వరలో చిత్రీకరణ పున:ప్రారంభం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సినిమాని  రెండు భాగాలుగా విడుదల చేస్తామని ఇటీవల చిత్ర వర్గాలు తెలిపాయి. కాగా ఫస్ట్ పార్ట్  2021 దీపావళికి విడుదల  చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని సమాచారం.

కోవిడ్ నిబంధనలు పాటిస్తూ శ్రీలంకలో ఈ సినిమా షూటింగ్‌ను తిరిగి ప్రారంభించాలని మణిరత్నం సన్నాహాలు చేస్తున్నారు. మణిరత్నం యొక్క మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.  చియాన్ విక్రమ్, కార్తీ, త్రిష, ఐశ్వర్య రాయ్ బచ్చన్, ఐశ్వర్య లక్ష్మి, శరత్‌కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూర్చుతున్నారు.

Also Read :

ఒక్క రోజులో రేషన్ కార్డ్, జగన్ సర్కార్ నయా రికార్డ్

సాయం కోసం భిక్షాటన చేసిన ప్రముఖ నటుడు శంకర్ !

కన్నతండ్రే సుపారీ ఇచ్చి కొడుకును చంపించాడు !