పవన్ కల్యాణ్ ప్రస్తతం వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో హరీశ్ శంకర్‌తో కూడా ఓ మూవీకి సైన్ చేశారు. ఈ సినిమా కోసం ఓ పవర్ ఫుల్ స్క్రిప్టును సిద్ధం చేశారట హరీశ్. ఈ సినిమాలో పవర్ స్టార్ కొన్ని నిమిషాల పాటు డాన్‌గా కనిపిస్తారని తెలుస్తోంది. అయితే ఫ్లాష్ బ్యాక్‌లో వచ్చే కొన్ని సీన్లలో మాత్రమే పవన్ ఈ గెటప్‌లో కనిపిస్తారని సమాచారం. దీంతో ఫ్యాన్స్‌లో అప్పుడే ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.