Nithiin : స్పీడ్ పెంచిన కుర్రహీరో.. 31వ సినిమా మొదలు పెట్టిన నితిన్.. ఇంట్రస్టింగ్ టైటిల్‌తో రాబోతున్న మూవీ..

|

Sep 11, 2021 | 11:21 AM

కుర్రహీరో నితిన్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే 30 సినిమాలు పూర్తి చేసిన ఈ యంగ్ హీరో ఇప్పుడు తన 31వ సినిమాను మొదలు పెట్టాడు.

Nithiin : స్పీడ్ పెంచిన కుర్రహీరో.. 31వ సినిమా మొదలు పెట్టిన నితిన్.. ఇంట్రస్టింగ్ టైటిల్‌తో రాబోతున్న మూవీ..
Nithin
Follow us on

Nithiin : కుర్రహీరో నితిన్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే 30 సినిమాలు పూర్తి చేసిన ఈ యంగ్ హీరో ఇప్పుడు తన 31వ సినిమాను మొదలు పెట్టాడు. హిట్లు ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న ఈ యంగ్ హీరో ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇటీవలే నితిన్ 31వ సినిమా పూజా కార్యక్రమాలను జరుపుకుంది. ఈ సినిమాకు ఆసక్తికర టైటిల్ ను అనౌన్స్ చేశారు. మాచర్ల నియోజకవర్గం అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కబోతుంది. ఎడిటర్ శేఖర్ దర్శకత్వం వహించబోతున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి నటిస్తుంది. ఈ సినిమాను నితిన్ హోం బ్యానర్‌లో నిర్మాణం జరుగబోతున్న ఈ సినిమా చాలా స్పెషల్ కథతో రూపొందబోతున్నట్లుగా చెబుతున్నారు.

ఇప్పటికే ఈ ఏడాది.. చెక్.. రంగ్ దే అలాగే మాస్ట్రో సినిమాలను చేశాడు నితిన్. మాచర్ల నియోజకవర్గం సినిమాను మాత్రం వచ్చే ఏడాది సమ్మర్‌కు ప్లాన్ చేస్తున్నారు. తాజాగా మాచర్ల నియోజకవర్గం టైటిల్‌ను ఖరారు చేసి, టైటిల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ చూస్తుంటే సినిమాలో యాక్షన్ పాళ్లు ఎక్కువేనని అర్థమవుతోంది. సుధాకర్ రెడ్డి – నికిత రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకి.. మహతి స్వరసాగర్ సంగీతాన్ని అందిస్తున్నారు. నితిన్ ఈ సినిమాలో ప్రభుత్వ ఆఫీసర్‌గా కనిపించబోతున్నాడని టాక్ వినిపిస్తుంది. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూట్‌ను మొదలుపెట్టనున్నాడు.

మరిన్ని ఇక్కడ చదవండి :

Tollywood Heroine: టాలీవుడ్ లేడీ సూపర్‌స్టార్‌గా దూసుకుపోతున్న ఈ నటి ఎవరో గుర్తు పట్టగలరా?

Sai Dharam Tej Accident: సాయి ధరమ్ తేజ్ చికిత్స పొందుతోన్న ఆస్పత్రికి సినీ ప్రముఖుల క్యూ.. ఎవరెవరు వచ్చారంటే..?

Tollywood Heroine: టాలీవుడ్ లేడీ సూపర్‌స్టార్‌గా దూసుకుపోతున్న ఈ నటి ఎవరో గుర్తు పట్టగలరా?