
సౌమిత్ పోలాడి, శ్రేయాసి సేన్ హీరో, హీరోయిన్లుగా నటించిన చిత్రం నిలవే. సౌమిత్, సాయి కే వెన్నం సంయుక్తంగా దర్శకత్వం వహించారు. POV ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజ్ అల్లాడ, గిరిధర్ రావు పోలాడి, సాయి కే వెన్నం సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ప్రేమికుల రోజు సందర్భంగా ఈ నెల 13న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా డీసెంట్ హిట్ గా నిలిచింది. పోటీగా ఫంకీ, సీతా పయనం వంటి సినిమాలున్నా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది. చాలా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీకి ఇప్పటి వరకు ర. కోటీకిపైగా గ్రాస్ కలెక్షన్లు వచ్చినట్లు తెలుస్తోంది. పాజిటివ్ టాక్ పెరుగుతుండడంతో ఈ సినిమా స్క్రీన్స్ కూడా పెరుగుతున్నాయి. మొదటి వారం 60థియేటర్లలో విడుదలయితే, రెండో వారం 75 థియేటర్లు పెరగడం విశేషం. ఈ క్రమంలో ప్రేక్షకుల కోసం చిత్ర బృందం ఒక మంచి ఆఫర్ ప్రకటించింది. ఈ శనివారం రూ.11 కే టికెట్ అని ప్రకటించింది. 11 పాటలు, 11 ఎమోషన్స్ ఉన్నాయని చెప్పి, పదకొండు రూపాయలకే టికెట్‌ని ప్రకటించారు. తద్వారా తమ సినిమాను మరింత మంది చూసే అవకాశం కల్పించనున్నట్లు చిత్ర బృందం పేర్కొంది.
ఈ సందర్బంగా హీరో సౌమిత్ మాట్లాడుతూ, `కొత్త వాళ్లమైనా మమ్మల్ని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. మా మూడేళ్ల కష్టమే ఈ నిలవే సినిమా. ది గ్రేట్ రాజమౌళి కూడా ‘బాహుబలి’ని ఆడియెన్స్ ముందుకు తీసుకురావడానికి మూడేళ్లు పట్టింది. మా ‘నిలవే’ మాకు ‘బాహుబలి’ లాంటిది. ఈ ప్రయాణంలో మాకెన్ని ఇబ్బందులొచ్చినా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ముందుకెళ్లాం. ఇప్పుడు మా సినిమాకు ప్రేక్షకుల నుంచి వస్తోన్న రెస్పాన్స్ చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఆడియెన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్, హౌస్‌ఫుల్ బోర్డ్స్ చూసి సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాం’ అని చెప్పారు.
₹11 lo cinema ante joke anukuntunnara?
Kadu… adi #Nilave team confidence 🔥
📍Mallikarjuna, Hyderabad
One ticket. One decision. One hit 🎬 pic.twitter.com/K2llKFP3ue— AGENT Shiva (@shivaMBKeerthy) February 20, 2026
Oreyy 😮 #Nilave only ₹11 ki ticket entraa Mallikarjuna thratre ,Hyderabad lo 🔥
Movie hit ayindhi ani team vallu 11rupees ki plan chesaru super ayya
Great 👏
Evaraina chudakapothe chuseyyandi manchi offer 😍 pic.twitter.com/u1cqy4W0eP— 🄲🄸🄽🄴 🄻🄾🄻🄻🄸 (@eshwar_stylish) February 20, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.