నెటిజ‌న్లతో నిహారిక స‌ర‌దా క‌బుర్లు.. ఆ అభిమానికి అవార్డు ఇస్తుంద‌ట‌..

|

Jul 16, 2020 | 3:55 PM

కరోనా వ్యాప్తి నేప‌థ్యంలో ప్ర‌స్తుతం సినిమా స్టార్స్ అంద‌రూ ఇళ్ల‌కే ప‌రిమిత‌మై కుటుంబ స‌భ్యుల‌తో విలువైన స‌మ‌యాన్ని గ‌డుపుతున్నారు. అప్పుడ‌ప్పుడు ఫ్యాన్స్ తో సోష‌ల్ మీడియా ద్వారా ముచ్చ‌టిస్తూ వాళ్ల‌ని ఎంట‌ర్టైన్ చేస్తున్నారు.

నెటిజ‌న్లతో నిహారిక స‌ర‌దా క‌బుర్లు.. ఆ అభిమానికి  అవార్డు ఇస్తుంద‌ట‌..
Follow us on

కరోనా వ్యాప్తి నేప‌థ్యంలో ప్ర‌స్తుతం సినిమా స్టార్స్ అంద‌రూ ఇళ్ల‌కే ప‌రిమిత‌మై కుటుంబ స‌భ్యుల‌తో విలువైన స‌మ‌యాన్ని గ‌డుపుతున్నారు. అప్పుడ‌ప్పుడు ఫ్యాన్స్ తో సోష‌ల్ మీడియా ద్వారా ముచ్చ‌టిస్తూ వాళ్ల‌ని ఎంట‌ర్టైన్ చేస్తున్నారు. ఈ క్ర‌మంలో తాజాగా మెగా డాట‌ర్ నిహారికా అభిమానుల‌ను ప‌లుక‌రించింది. అందులో భాగంగా ఓ నెటిజ‌న్ మీ ముఖంపై పింపుల్ గ‌మ‌నించా అంటూ వ్యాఖ్యానించ‌గా..స్పందించిన నిహారిక‌..కంగ్రాట్స్..మీ ఇంటికి అవార్డ్ పంపిస్తా అని ఫ‌న్నీగా కామెంట్ పెట్టింది.

ఇక మ‌రో నెటిజ‌న్ ప్ర‌స్తుతం మీ ఫోన్ వాల్ పేప‌ర్ ఏంటి అడ‌గ్గా..త‌న కాబోయే శ్రీవారు చైత‌న్య‌తో దిగిన ఫోటో వాల్ పేపర్‌గా ఉన్న‌ట్లు వెల్ల‌డించింది. ఇలా త‌న ఫాలోవ‌ర్స్ తో స‌రదాగా కాసేపు మ‌చ్చ‌టించింది. ఇక ఈ అమ్మ‌డు తాను మ‌నువాడ‌బోయే వ్య‌క్తిని ఇటీవ‌లే బాహ్య ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేసిన సంగ‌తి తెలిసిందే. గుంటూరు జిల్లాకు చెందిన పోలీసు అధికారి జొన్న‌ల‌గ‌డ్డ ప్రభాకర్‌ రావు త‌న‌యుడు చైత‌న్య‌తో జీవితాన్ని పంచుకోబోతుంది నిహారిక‌. అయితే పెళ్లి త‌ర్వాత కూడా సినిమాల్లో న‌టిస్తుంద‌ట ఈ కుంద‌న‌పు బొమ్మ‌.