Navdeep: ఈ ఒక్కసారి నన్ను వదిలేశారు.. నా పేరు రాలేదని నిరుత్సాహపడ్డారేమో.. నవదీప్ ఆసక్తికర కామెంట్స్..

|

May 26, 2024 | 1:23 PM

ఈ పార్టీలో ఎక్కువ మంది తెలుగు వారే పాల్గొనడంతో ఇటు తెలంగాణ సర్కార్ సైతం బెంగుళూరు రేవ్ పార్టీ కేసుపై మరింత ఫోకస్ పెట్టింది. ఈ కేసులో మరికొంత పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉందని ప్రచారం నడుస్తుంది. ఈ క్రమంలో టాలీవుడ్ నటుడు నవదీప్ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి.

Navdeep: ఈ ఒక్కసారి నన్ను వదిలేశారు.. నా పేరు రాలేదని నిరుత్సాహపడ్డారేమో.. నవదీప్ ఆసక్తికర కామెంట్స్..
Navdeep
Follow us on

తెలుగు రాష్ట్రాల్లో బెంగుళూరు రేవ్ పార్టీ కేసు హాట్ టాపిక్‏గా మారిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఎక్కువ మంది తెలుగు సినీ పరిశ్రమకు చెందినవారే ఉండడంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో దీనిపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. ఇప్పటివరకు జరిగిన బ్లడ్ శాంపిల్స్ టెస్టులో మొత్తం 86 మందికి డ్రగ్స్ పాజిటివ్ రావడంతో తెలుగు నటీమణులు హేమ, ఆషీరాయ్ తోపాటు మరికొంతమందికి నోటీసులు జారీ చేశారు బెంగుళూరు పోలీసులు. ఈ రేవ్ పార్టీకి సంబంధించిన దర్యాప్తు వేగవంతం చేశారు బెంగుళూరు నార్కొటిక్ పోలీసులు. ఈ పార్టీలో ఎక్కువ మంది తెలుగు వారే పాల్గొనడంతో ఇటు తెలంగాణ సర్కార్ సైతం బెంగుళూరు రేవ్ పార్టీ కేసుపై మరింత ఫోకస్ పెట్టింది. ఈ కేసులో మరికొంత పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉందని ప్రచారం నడుస్తుంది. ఈ క్రమంలో టాలీవుడ్ నటుడు నవదీప్ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి.

నిజానికి తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడూ ఎక్కడ డ్రగ్ కేసు విచారణ జరిగిన ఇండస్ట్రీ నుంచి నవదీప్ పేరు ఎక్కువగా వినిపిస్తుంది. కొన్నాళ్ల క్రితం నవదీప్ పేరు మరోసారి తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు బెంగుళూరు రేవ్ పార్టీ కేసులో నవదీప్ పేరు అసలు వినిపించడం లేదు. ఇదే విషయంపై ప్రశ్నించగా.. ఆ పార్టీలో తన పేరు లేనందుకు చాలా మంది నిరుత్సాహపడి ఉంటారని అన్నారు.

ప్రస్తుతం నవదీప్ హీరోగా లవ్ మౌళి సినిమాను రూపొందించారు. ఈ మూవీ ప్రమోషన్లలో పాల్గొన్న నవదీప్ బెంగుళూరు రేవ్ పార్టీ పై స్పందించారు. ఈసారి నువ్వు ఫేక్ న్యూస్ లో కనిపించడం లేదు అంటూ కొందరు అభిమానులు తనను సోషల్ మీడియాలో ప్రశ్నించారని అన్నారు నవదీప్. చిత్ర పరిశ్రమకు సంబంధించి ఇలా ఏదైన అంశం సంచలనంగా మారితే మీపై ఆరోపణలు వచ్చేవి. ఈసారి రాలేదు అంటూ ఓ విలేకరి ప్రశ్నించగా.. మంచి జరిగిందని అనుకుంటున్నాను.. ఈ ఒక్కసారి నన్ను వదిలేశారు అంటూ సరాదాగా ఆన్సర్ ఇచ్చారు.

రేవ్ పార్టీ అంటే రేయి, పగలు జరిగేదని ఓ ప్రశ్నకు ఆన్సర్ ఇచ్చారు. ఆ పార్టీ ఒక్కో దేశంలో ఒక్కోలా ఉంటుందన్నారు. ప్రస్తుతం నవదీప్ నటించిన లవ్ మౌళి సినిమాలో భావన సాగి కథానాయికగా నటించింది. రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కించిన ఈ మూవీకి అవనీంద్ర దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని జూన్ 7న విడుదల చేయనున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.