Dasara: నేచురల్ స్టార్ నాని ‘దసరా’ టీజర్ కు ముహూర్తం ఖరారు.. రిలీజ్ ఎప్పుడంటే

|

Jan 26, 2023 | 8:20 AM

ఈ సినిమాలో నాని మాస్ మసాలా గెటప్ లో కనిపించనున్నాడు. మార్చి 30న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ విడుదలకు సిద్ధమవుతోంది.

Dasara: నేచురల్ స్టార్ నాని దసరా టీజర్ కు ముహూర్తం ఖరారు.. రిలీజ్ ఎప్పుడంటే
Nani, Dasara Movie
Follow us on

నేచురల్ స్టార్ నాని మోస్ట్ ఎవైటెడ్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘దసరా’. ఈ మూవీ కోసం నాని అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో నాని మాస్ మసాలా గెటప్ లో కనిపించనున్నాడు. మార్చి 30న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ విడుదలకు సిద్ధమవుతోంది. నాని కెరీర్ లో తొలి పాన్ ఇండియా చిత్రమిది. నూతన దర్శకుడు శ్రీకాంత్ ఒదెల దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రొడక్షన్ పనులు ఇప్పటికే పూర్తి కాగ, పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి.

తాజాగా మేకర్స్ బిగ్ అనౌన్స్ మెంట్ తో వచ్చారు. జనవరి 30న విడుదల కానున్న ఈ సినిమా టీజర్‌కి సంబంధించిన అనౌన్స్ మెంట్ ఇది. అనౌన్స్ మెంట్ వీడియోలో మధ్య వయస్కుడైన గ్రామస్థుడు బీడీ వెలిగించి, అగ్గిపుల్లని విసిరినప్పుడు మంటలు చెలరేగుతాయి. ఆ మంటల్లో టీజర్ తేదీని రివిల్ చేయడం చాలా ఆసక్తికరంగా వుంది. కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తుండగా, దీక్షిత్ శెట్టి కీలక పాత్రలో కనిపించనున్నారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. సముద్రఖని, సాయి కుమార్, జరీనా వహాబ్ కీలక పాత్రలలో కనిపించనున్న ఈ చిత్రానికి సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫర్ గా పని చేస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.

ఈ చిత్రానికి ఎడిటర్‌గా నవీన్‌ నూలి, ప్రొడక్షన్‌ డిజైనర్‌గా అవినాష్‌ కొల్లా, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాతగా విజయ్‌ చాగంటి వ్యవహరిస్తున్నారు. దసరా చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.