నాని కొడుకు అల్లరి చూశారా?..జున్నుగాడు మాములోడు కాడు!

|

Jul 28, 2019 | 2:33 PM

హైదరాబాద్‌: చిన్న పిల్లల అల్లరిని తట్టుకోవడం మాములు విషయం కాదు. అప్పుడే నడవడం నేర్చుకున్న పిల్లలు ఓ పరిగెడుతూ ఉంటారు. వారిని కుదురుగా ఉంచటం తల్లిదండ్రులకు ప్రాణ సంకటమే. ఇప్పుడు నేచురల్‌ స్టార్‌ నాని కుమారుడు అర్జున్‌ కూడా అలానే తెగ పోరు పెడుతున్నాడట. ఈ విషయాన్ని నాని వైఫ్ అంజన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా తెలిపారు. అంతేకాదు తనకు చాలా ఇష్టమైన ఫొటో అంటూ.. అర్జున్‌ పుట్టిన నెల రోజులకు తీసిన అపురూపమైన ఫొటోను షేర్‌ చేశారు. […]

నాని కొడుకు అల్లరి చూశారా?..జున్నుగాడు మాములోడు కాడు!
Follow us on

హైదరాబాద్‌: చిన్న పిల్లల అల్లరిని తట్టుకోవడం మాములు విషయం కాదు. అప్పుడే నడవడం నేర్చుకున్న పిల్లలు ఓ పరిగెడుతూ ఉంటారు. వారిని కుదురుగా ఉంచటం తల్లిదండ్రులకు ప్రాణ సంకటమే. ఇప్పుడు నేచురల్‌ స్టార్‌ నాని కుమారుడు అర్జున్‌ కూడా అలానే తెగ పోరు పెడుతున్నాడట. ఈ విషయాన్ని నాని వైఫ్ అంజన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా తెలిపారు. అంతేకాదు తనకు చాలా ఇష్టమైన ఫొటో అంటూ.. అర్జున్‌ పుట్టిన నెల రోజులకు తీసిన అపురూపమైన ఫొటోను షేర్‌ చేశారు.

అందులో బుడతడు నిద్రలో తెగ నవ్వుతూ కనిపించాడు. బాబును ఎత్తుకుని ఉన్న అంజన.. అద్దం ముందు నిలబడి ఫొటో తీశారు. అంతేకాదు అర్జున్‌ ఏ మాత్రం కుదురుగా ఉండటం లేదంటూ బాబు చిందులేస్తూ ఆడుకుంటున్న వీడియోను, ఫొటోను షేర్‌ చేశారు. బాబు తన జీన్స్‌ కాదంటూ.. పరోక్షంగా అన్నీ నాని పోలికలేనని కామెంట్‌ చేశారు.