Nandamuri Balakrishna: అనిల్ రావిపూడి సినిమాలో బాలయ్య అలా కనిపించనున్నాడా.?

|

Jan 28, 2023 | 7:21 AM

వీరసింహారెడ్డి విజయంతో బాలయ్య అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఇక ఈ సినిమా తర్వాత  బాలయ్య.. డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేయనున్నారు.

Nandamuri Balakrishna: అనిల్ రావిపూడి సినిమాలో బాలయ్య అలా కనిపించనున్నాడా.?
Balakrishna
Follow us on

గాడ్ ఆఫ్ మాసస్ నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా వీరసింహారెడ్డి. క్రాక్ సినిమాతో బ్లాక్‌ బస్టర్ అందుకున్న మేకర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ‘వీరసింహారెడ్డి’ చిత్రం సంక్రాంతి కానుకగా ఈ నెల 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌‌గా విడుదలైంది. ఈ సినిమాకు మొదటి షో నుంచి హిట్ టాక్ రావడంతో కలెక్షన్స్ వర్షం కురుస్తోంది. ఇక వీరసింహారెడ్డి విజయంతో బాలయ్య అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఇక ఈ సినిమా తర్వాత  బాలయ్య.. డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేయనున్నారు. త్వరలోనే ఈ మూవీ రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం కానుంది. అయితే కొద్దిరోజులుగా ఈ సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొడుతున్నాయి.

వీరసింహారెడ్డి సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ఇప్పుడు అనిల్ సినిమా పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. బాలయ్య.. అనిల్ రావిపూడి కాంబోలో రాబోయే ప్రాజెక్ట్‎కు ఆసక్తికర టైటిల్ నిర్ణయించారట. ఈ మూవీకి రామారావు గారు అనే టైటిల్ ఫిక్స్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. ప్రస్తుతం డైరెక్టర్ అనిల్..ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తిచేసే పనిలోఉన్నారు.

ఇక అనిల్ రావిపూడి చాలా రోజుల క్రితమే తన సినిమాలో బాలయ్య సింగిల్ రోల్ లో కనిపిస్తాడని తెలిపారు. పైగా తెలంగాణ యాసలో బాలయ్య మాట్లాడతారని కూడా క్లారిటీ ఇచ్చాడు. కానీ ఇప్పుడు మరోసారి బాలకృష్ణ ఈ సినిమాలో డ్యూయల్ రోల్ లో కనిపిస్తారని అంటున్నారు. దర్శకుడు క్లారిటీ ఇచ్చిన ఈ రూమర్స్ మాత్రం ఆగడంలేదు. మరోసారి అనిల్ ఈ వార్తలపై క్లారిటీ ఇవ్వాలని నందమూరి ఫ్యాన్స్ కోరుతున్నారు.