Upcoming Movies: ఈ వారం థియేటర్స్‏లో విడుదలయ్యే సినిమాలు ఇవే.. ఆ రెండు సినిమాలు స్పెషల్..

|

Jun 11, 2024 | 5:39 PM

ఇటీవల విడుదలైన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, గం గం గణేశా, భజే వాయు వేగం చిత్రాలు మంచి రివ్యూస్ అందుకున్నాయి. ఇక ఈ వారం మరిన్ని చిత్రాలు అడియన్స్ ముందుకు రాబోతున్నాయి. ఇటు థియేటర్లలో పలు చిత్రాలు రిలీజ్ అవుతుండగా.. ఇప్పటివరకు ప్రేక్షకులను ఆకట్టుకున్న సూపర్ హిట్ మూవీస్. సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నాయి. మరీ ఈ వారం థియేటర్స్, ఓటీటీలో రాబోయే చిత్రాలెంటో చూద్దామా.

Upcoming Movies: ఈ వారం థియేటర్స్‏లో విడుదలయ్యే సినిమాలు ఇవే.. ఆ రెండు సినిమాలు స్పెషల్..
Tollywood Movies
Follow us on

థియేటర్లలో మళ్లీ సినిమాల సందడి మొదలైంది. వేసవికాలం పూర్తిగా సైలెంట్ అయిన బాక్సాఫీస్.. ఇప్పుడు చిన్న, పెద్ద చిత్రాలతో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యాయి. ఇటీవల విడుదలైన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, గం గం గణేశా, భజే వాయు వేగం చిత్రాలు మంచి రివ్యూస్ అందుకున్నాయి. ఇక ఈ వారం మరిన్ని చిత్రాలు అడియన్స్ ముందుకు రాబోతున్నాయి. ఇటు థియేటర్లలో పలు చిత్రాలు రిలీజ్ అవుతుండగా.. ఇప్పటివరకు ప్రేక్షకులను ఆకట్టుకున్న సూపర్ హిట్ మూవీస్. సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నాయి. మరీ ఈ వారం థియేటర్స్, ఓటీటీలో రాబోయే చిత్రాలెంటో చూద్దామా.

విజయ్ సేతుపతి.. మహారాజా..
కోలీవుడ్ స్టార్ మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా మహారాజ. నిథిలన్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో అనురాగ్ కశ్యప్, అభిరామి, మమత కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని జూన్ 14న థియేటర్లలో విడుదల కానుంది.

సుధీర్ బాబు హరోంహర..

టాలెంటెడ్ హీరో సుధీర్ బాబు నటిస్తున్న లేటేస్ట్ మూవీ హరోంహర. జ్ఞానసాగర్ ద్వారక రూపొందించిన ఈ సినిమాలో సునీల్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. చిత్తూరు జిల్లా కుప్పంలోని 1989 నాటి పరిస్థితుల నేపథ్యంలో తెరకెక్కించిన ఈ యాక్షన్ మూవీ జూన్ 14న రిలీజ్ కానుంది.

రెండు సినిమాలతో చాందినీ చౌదరి..

కలర్ ఫోటో సినిమాతో కథానాయికగా మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకున్న తెలుగమ్మాయి చాందినీ చౌదరి. ఇటీవలే గామి సినిమాతో అలరించిన చాందిని ఇప్పుడు ఒకేసారి రెండు సినిమాలతో థియేటర్లలో సందడి చేయబోతుంది. చాందినీ చౌదరి, వశిష్ట సింహా, భరత్ రాజ్, అషురెడ్డి ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం యేవమ్. ప్రకాశ్ దంతులూర దర్శకత్వం వహించిన ఈ మూవీ జూన్ 14న రిలీజ్ కానుంది. మహిళ సాధికారితను చాటి చెప్పే చిత్రిమిది.

యేవమ్ సినిమాతో చాందిని నటించిన మరో సినిమా మ్యూజిక్ షాప్ మూర్తి. ఇందులో పుష్ప ఫేమ్ నటుడు అజయ్ ఘోష్ కీలకపాత్ర పోషించాడు. శివ పాలడుగు దర్శకత్వం వహించిన ఈ సినిమా జూన్ 14న రిలీజ్ కానుంది.

వీటితోపాటు.. కన్నడ స్టార్ యశ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రాజధాని. గతంలో కన్నడలో భారీ విజయాన్ని అందుకున్న ఈ సినిమాను ఇప్పుడు తెలుగులోకి రాజధాని రౌడీ పేరుతో జూన్ 14న రిలీజ్ చేస్తున్నారు. అలాగే యానియా భరద్వాజ్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ఇంద్రాణి. కబీర్ దుహాన్ సింగ్ ముఖ్య పాత్ర పోషించిన ఈ సినిమాను జూన్ 14న విడుదల చేయనున్నారు.

ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు..

నెట్ ఫ్లిక్స్..

  • గ్యాంగ్య్ ఆఫ్ గోదావరి.. జూన్ 14
  • మహరాజ్.. హిందీ.. జూన్ 14
  • బ్రిడ్జ్ టన్.. వెబ్ సిరీస్.. జూన్ 13
  • మిస్టరీస్ ఆఫ్ ది టెర్రకోట వారియర్స్.. హలీవుడ్.. జూన్ 12

అమెజాన్ ప్రైమ్..

  • ది బాయ్స్ 4.. వెబ్ సిరీస్.. జూన్ 13

జీ 5.

  • పరువు.. తెలుగు.. జూన్ 14
  • లవ్ కీ అరెంజ్ మ్యారేజ్..హిందీ.. జూన్ 14

డిస్నీ ప్లస్ హాట్ స్టార్..

  • ప్రొటెక్టింగ్ ప్యారడైజ్.. డాక్యుమెంటరీ.. జూన్ 10
  • నాట్ డెడ్ యెట్.. వెబ్ సిరీస్.. జూన్ 12

ఆహా..

  • పారిజాత పర్వం.. తెలుగు.. జూన్ 12

జియో సినిమా..

  • గాంత్.. హిందీ.. జూన్ 11

ఆపిల్ టీవీ ప్లాస్..

  • ప్రిజ్యూమ్డ్ ఇన్నోసెంట్.. వెబ్ సిరీస్.. జూన్ 12

బుక్ మై షో..

  • ది ఫాల్ గై.. హాలీవుడ్.. జూన్ 14