Love Story: నాగచైతన్య కోసం రంగంలోకి బాలీవుడ్ హీరో.. లవ్ స్టోరీ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో సందడి చేయనున్న మెగాస్టార్.. అమీర్ ఖాన్ .. 

| Edited By: Anil kumar poka

Sep 19, 2021 | 6:20 PM

ఎట్టకేలకు నాగచైతన్య.. సాయి పల్లవి జంటగా నటించిన లవ్ స్టోరీ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. గత కొద్ది నెలలుగా వాయిదా పడుతూ

Love Story: నాగచైతన్య కోసం రంగంలోకి బాలీవుడ్ హీరో.. లవ్ స్టోరీ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో సందడి చేయనున్న మెగాస్టార్.. అమీర్ ఖాన్ .. 
Love Story
Follow us on

ఎట్టకేలకు నాగచైతన్య.. సాయి పల్లవి జంటగా నటించిన లవ్ స్టోరీ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. గత కొద్ది నెలలుగా వాయిదా పడుతూ వస్తున్న లవ్ స్టోరీ సినిమా ఈసారి థియేటర్లలో విడుదల కానుంది. ఈ మూవీ కోసం ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. అందమైన ప్రేమ కథగా తెరకెక్కిన ఈ సినిమాలో హీరో హీరోయిన్లు ఇద్దరు తెలంగాణ యాసలో మాట్లాడనున్నారు. ఇటీవలే విడుదలైన టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. విడుదలైన కొద్ది గంటల్లోనే ఈ మూవీ ట్రైలర్ యూట్యూబ్‏లో రికార్డ్స్ సృష్టించింది. ఇక రిలీజ్ దగ్గర పడుతుండటంతో ప్రీరిలీజ్ ఈవెంట్‌ను ఏర్పాటు చేశారు చిత్రయూనిట్. ఇక కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. ఆతర్వాత షూటింగ్ పూర్తి చేసి రిలీజ్ చేద్దాం అనుకుంటే నాని టక్ జగదీశ్ సినిమా షాక్ ఇచ్చింది. ముందుగా వినాయక చవితి సందర్భంగా సినిమాను రిలీజ్ చేద్దాం అనుకుంటే అదే రోజు నాని సినిమా ఓటీటీ వేదికగా విడుదల అంటూ ప్రకటించింది. దాంతో చిన్నపాటి రచ్చ కూడా జరిగింది. ఇక ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో థియేటర్స్ సమస్యలతో మారోసారి ఈ మూవీ విడుదల వాయిదా పడిన సంగతి తెలిసిందే.

ఇక సినిమా విషయానికి వస్తే.. గ్రామీణా ప్రాంతాల నుంచి ఎదో సాధించడానికి హైదరాబాద్ సిటీకి వచ్చిన ఇద్దరు ప్రేమికుల కథగా ఈ సినిమాను రూపొందించారు. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో చిత్రయూనిట్ ప్రమోషన్స్‌లో కూడా స్పీడ్ పెంచింది. ఇక ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌ను ఈరోజు సాయంత్రం 5 గంటలకు గ్రాండ్‌గా నిర్వహించనున్నారు చిత్రయూనిట్. ఇందుకోసం ఇద్దరు స్టార్ హీరోలు గెస్ట్‏లుగా రాబోతున్నారు. అందులో ఒకరు మెగాస్టార్ ఇక ఇప్పుడు చైతన్య సినిమా ప్రీరిలీజ్‌కు మెగాస్టార్ రావడం అక్కినేని అభిమానుల్లో మరింత జోష్ పెంచింది. అలాగే బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ సైతం అక్కినేని నాగచైతన్య సినిమాకు ముఖ్య అతిథిగా రాబోతుండడంతో అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు.

బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన లాల్ సింగ్ చద్ధా సినిమాలో నాగచైతన్య కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ పూర్తైంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే లవ్ స్టోరీ ప్రీ రిలీజ్ ఈవెంట్‏కు ముఖ్య అతిథిగా రానున్నారు.

Also Read:

ఏపీ పరిషత్ ఫైట్ 

ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

బాలాపూర్ గణేష్ నిమజ్జనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Live AP MPTC ZPTC Elections Counting Live: పరిషత్‌ పంచాయతీ.. ప్రారంభమైన కౌంటింగ్ ప్రక్రియ..