Irumudi Movie: బల్లగుద్ది చెబుతున్నాను.. ఈ సినిమా మీకు తెగ నచ్చేస్తుంది: రవితేజ

మాస్ మహారాజా రవి తేజ, శివ నిర్వాణ, మైత్రి మూవీ మేకర్స్ 'ఇరుముడి' చిత్రం నుంచి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'మల్లెపూల పల్లకి' సాంగ్ రిలీజ్- గూస్‌బంప్స్ తెప్పించేలా అదిరిపోయింది పాట. ఇక ఇరుముడి’ మంచి ఎమోషనల్ రైడ్. క్యారెక్టర్స్ మీ మైండ్‌లో ఉండిపోతాయి. బల్లగుద్ది చెబుతున్నా.. ‘ఇరుముడి’ మీకు తెగ నచ్చేస్తుందని గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో మాస్ మహారాజా రవితేజ అన్నారు.

Irumudi Movie: బల్లగుద్ది చెబుతున్నాను.. ఈ సినిమా మీకు తెగ నచ్చేస్తుంది: రవితేజ
Raviteja

Updated on: Aug 17, 2026 | 7:09 AM

మాస్ మహారాజా రవితేజ మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ఇరుముడి’ ఆగస్టు 21న థియేటర్లలో విడుదల కానుంది. శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ డిఫరెంట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఆసక్తికరమైన గ్లింప్స్, మెలోడీతో పాటు ఎనర్జిటిక్ సాంగ్స్‌తో సినిమా మంచి బజ్ క్రియేట్ చేసింది. తాజాగా విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ అంచనాలను మరింత పెంచింది. ‘ఇరుముడి’లోని భక్తి భావానికి మరింత ఎనర్జీని జోడిస్తూ మేకర్స్ మోస్ట్ అవైటెడ్ ‘మల్లెపూల పల్లకి’ పాటను విడుదల చేశారు. గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో లాంచ్ చేసిన ఈ పాట.. అందరికీ సుపరిచితమైన అయ్యప్ప భక్తి గీతానికి కొత్త రూపాన్ని తీసుకొచ్చింది.  ఇక ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరో రవితేజ మాట్లాడుతూ..

“మా ప్రొడక్షన్ డిజైనర్ సాహి సురేష్, ఎడిటర్ ప్రవీణ్ పూడి, డీఓపీ విష్ణు శర్మ ఈ సినిమాను ఎంతో ఓన్ చేసుకుని పనిచేశారు. అందరూ తమ సొంత సినిమా అనుకుని పనిచేశారు. విష్ణు శర్మ ఎక్స్‌ట్రార్డినరీ కెమెరామెన్. నాకు, శివ నిర్వాణకు తోడుగా తను కూడా పరిగెత్తాడు. ఫెంటాస్టిక్ వర్క్ ఇచ్చాడు. తనతో మళ్లీ పని చేయాలని ఉంది. జీవీ ప్రకాష్ కుమార్ సూపర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. ఈ సినిమా ఒక మంచి ఎమోషనల్ రైడ్. నేను చెప్పడం కంటే సినిమా చూసిన తర్వాత మీరే చెబుతారు. ఇందులో నటించిన ప్రతి ఒక్కరూ అద్భుతంగా చేశారని అన్నారు.

ప్రతి క్యారెక్టర్‌కు ఇంపార్టెన్స్ ఉంటుంది. స్వాసిక నటన చూస్తే మీకు భయమేస్తుంది. అంత అద్భుతంగా చేసింది. నిజంగా కొన్ని క్యారెక్టర్స్ మీ మైండ్‌లో ఉండిపోతాయి. ఆగస్టు 21న సినిమా చూసినప్పుడు మీకే అర్థమవుతుంది. ఇందులో ప్రతి క్యారెక్టర్ చాలా బాగుంటుంది. ఈ సినిమాలో మీరు ఒక డిఫరెంట్ సాయికుమార్ గారిని చూస్తారు. సినిమా గురించి చాలా మాట్లాడుకుంటారు. జీవీ ప్రకాష్ బ్రహ్మాండమైన పాటలు ఇచ్చారు. నక్షత్ర ఫ్యూచర్‌లో చాలా పెద్ద హీరోయిన్ అవుతుంది. మా ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చే సీన్స్ మిమ్మల్ని టచ్ చేస్తాయి. సినిమాలో మీకు ప్రియా భవానీ శంకర్ కనిపించదు.. కేవలం కావేరి పాత్ర మాత్రమే కనిపిస్తుంది. ఒకటి రెండు మూడు సీన్లు ఉంటాయి.. వాటిలో ఎక్స్‌లెంట్‌గా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. మా నిర్మాతలు రవి, నవీన్ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. మా కాంబినేషన్‌లో ఇది మూడో సినిమా. భవిష్యత్‌లో ఇంకా సినిమాలు చేస్తాం. ఒక విషయం మాత్రం బల్లగుద్ది చెబుతున్నాను.. ఈ సినిమా మీకు తెగ నచ్చేస్తుంది. అందరూ థియేటర్లలో ఒక మంచి సినిమాను ఎక్స్‌పీరియన్స్ చేయబోతున్నారు. ఒక డిఫరెంట్ రవితేజను చూడబోతున్నారు. మా డైరెక్టర్ శివ గురించి సక్సెస్ మీట్‌లో మాట్లాడుతాను.. జై సినిమా అన్నారు రవితేజ.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us