Kannappa Movie : ‘క‌న్న‌ప్ప‌’లో ప్రభాస్ సీన్స్ కోసం ఇలా ప్లాన్ చేస్తున్నారట..

|

Jan 30, 2024 | 11:27 AM

విదేశాల్లో కన్నప్ప సినిమా ను మొదలు పెట్టి అక్కడ కొన్ని సన్నివేశాలు తెరకెక్కించిన తర్వాత ఇండియాకు తిరిగి వచ్చారు చిత్రయూనిట్. కన్నప్ప సినిమాలో చాలా మంది స్టార్ నటులు నటిస్తున్నారని తెలుస్తోంది. అలాగే రెబల్ స్టార్ ప్రభాస్ ఈ సినిమాలో శివుడి పాత్రలో కనిపించనున్నారు. అలాగే పార్వతీ దేవిగా నయనతార నటిస్తుందని టాక్ వినిపిస్తుంది.

Kannappa Movie : ‘క‌న్న‌ప్ప‌’లో ప్రభాస్ సీన్స్ కోసం ఇలా ప్లాన్ చేస్తున్నారట..
Kannappa Movie
Follow us on

మంచి విష్ణు ఇప్పుడు కన్నప్ప సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నాడు. భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు మంచు మోహన్ బాబు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. విదేశాల్లో కన్నప్ప సినిమా ను మొదలు పెట్టి అక్కడ కొన్ని సన్నివేశాలు తెరకెక్కించిన తర్వాత ఇండియాకు తిరిగి వచ్చారు చిత్రయూనిట్. కన్నప్ప సినిమాలో చాలా మంది స్టార్ నటులు నటిస్తున్నారని తెలుస్తోంది. అలాగే రెబల్ స్టార్ ప్రభాస్ ఈ సినిమాలో శివుడి పాత్రలో కనిపించనున్నారు. అలాగే పార్వతీ దేవిగా నయనతార నటిస్తుందని టాక్ వినిపిస్తుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం.. కన్నప్ప సినిమాలో కొన్ని సన్నివేశాలను సినిమాకె హైలైట్ అయ్యేలా తెరకెక్కిస్తున్నారట.

వాటిలో ప్రభాస్ సీన్స్ కూడా ఉన్నాయట. ప్రభాస్ పాత్రను ఇంట్రవెల్ సీన్ లో రిలీవ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట. ఇందుకోసం హై ఇంటెన్స్ సీన్స్ రాసుకుంటున్నారట. అలాగే ప్రత్యేకంగా వేసిన సెట్ లో ఈ సన్నివేశాన్ని చిత్రీకరించాలని చూస్తున్నారట. ప్రభాస్ శివుడి గెటప్ లో కనిపించడం దగ్గర నుంచి సినిమా స్థాయి నెక్స్ట్ లెవల్ కు వెళ్తుందట.

ఇక ప్రభాస్ సీన్స్ యూ త్వరలోనే షూట్ చేయనున్నారట. ఇందుకోసం ఓ భారీ సెట్ ను కూడా నిర్మిస్తున్నారట. మొత్తానికి ఈ సీన్స్ సినిమాకే హైలైట్ అవుతాయని తెలుస్తోంది. కన్నప్ప తెలుగువాడే రాజంపేట ప్రాంతంలోని ఉటుకూరు ఈయన స్వస్థలం. అక్కడ కూడా కన్నప్ప టీమ్ షూటింగ్ నిర్వహించారని తెలుస్తోంది. ఇక కన్నప్ప సినిమాలో చాలా మంది స్టార్ నటులు కూడా నటించనున్నారు. బ్రహ్మానందం, శరత్ కుమార్ తో పాటు కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ . మోహన్ లాల్ కూడా నటిస్తున్నారని టాక్ వినిపిస్తుంది.

కన్నప్ప మూవీ ట్విట్టర్ లేటెస్ట్ పోస్ట్..

కన్నప్ప మూవీ ట్విట్టర్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి