కలెక్షన్ల ఊచకోత..మహేశ్ మానియా అంటే ఇదే..!

|

Jan 17, 2020 | 7:58 PM

సూపర్‌స్టార్ మహేశ్ బాబు బాక్సాఫీసు స్టామినా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆరంభ కలెక్షన్లలో మహేశ్‌ను మించినవారు లేరు. ఇక హిట్, బ్లాక్ బాస్టర్ టాక్స్ వచ్చాయంటే ఆ హంగామా వర్ణించలేనిది. ఇప్పుడు అదే జరుగుతోంది. హిట్ టాక్‌తో ‘సరిలేరు నీకెవ్వరు’ దూసుకెళ్తుంది. మహేశ్ మానియా వర్కవుట్ అయ్యి కలెక్షన్ల సునామీ సాగుతోంది. విజయశాంతి, సంగీత లాంటి ఓల్డ్ హీరోయిన్స్ రీ ఎంట్రీతో సినిమాకు మరింత గ్లామర్ యాడ్ అయ్యింది. అన్నీ అంశాల సమమేళవింపుతో సంక్రాంతి సీజన్‌లో […]

కలెక్షన్ల ఊచకోత..మహేశ్ మానియా అంటే ఇదే..!
Follow us on

సూపర్‌స్టార్ మహేశ్ బాబు బాక్సాఫీసు స్టామినా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆరంభ కలెక్షన్లలో మహేశ్‌ను మించినవారు లేరు. ఇక హిట్, బ్లాక్ బాస్టర్ టాక్స్ వచ్చాయంటే ఆ హంగామా వర్ణించలేనిది. ఇప్పుడు అదే జరుగుతోంది. హిట్ టాక్‌తో ‘సరిలేరు నీకెవ్వరు’ దూసుకెళ్తుంది. మహేశ్ మానియా వర్కవుట్ అయ్యి కలెక్షన్ల సునామీ సాగుతోంది. విజయశాంతి, సంగీత లాంటి ఓల్డ్ హీరోయిన్స్ రీ ఎంట్రీతో సినిమాకు మరింత గ్లామర్ యాడ్ అయ్యింది. అన్నీ అంశాల సమమేళవింపుతో సంక్రాంతి సీజన్‌లో రచ్చ చేస్తున్నాడు సూపర్ స్టార్. సినిమా ఇప్పటికే సేఫ్ జోన్‌లోకి వెళ్లినట్టు ట్రేడ్ రిపోర్ట్ అందుతోంది.

సరిలేరు నీకెవ్వరు 6 డేస్ కలెక్షన్స్ :

నైజాం :రూ. 25.65 కోట్లు
సీడెడ్ : రూ. 11.35 కోట్లు
గుంటూరు : రూ. 7.72 కోట్లు
నెల్లూరు : రూ. 2.86 కోట్లు
వైజాగ్ :రూ.  11.8 కోట్లు
ఈస్ట్ గోదావరి : రూ. 7.23 కోట్లు
వెస్ట్ గోదావరి : రూ. 5.06 కోట్లు
కృష్ణ :రూ. 6.27 కోట్లు
ఆంధ్ర + తెలంగాణ : రూ. 77.94 కోట్లు(షేర్)