సూపర్ స్టార్ మహేశ్.. ఆయన రీల్ లైఫ్‌లోనే కాదు.. రియల్ లైఫ్‌లో సైతం సూపర్ స్టారే. మహేశ్ ఫ్యాన్ బేస్ అనంతం. పాన్ ఇండియా మార్కెట్ కోసం అందరూ అల్లాడుతుంటే.. ఆ ఆలోచన కూడా చేయడం లేదు మహేశ్. తెలుగు జనాల్ని ఎంటర్టైన్ చేస్తే వస్తే తృప్తి చాలు అని ఎప్పుడే చెప్పేశారు. ఇక మహేశ్‌ది ఎంత మంచి మనసో ప్రత్యేకంగా చెప్పాలా..? సినిమా ఫ్లాప్ అయితే నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల కోసం డబ్బులు వెనక్కి ఇచ్చేసిన ఘటనలు కోకొల్లలు. ఇంకా ఎన్నో గుప్త ధానాలు చేశారు. చిన్న పిల్లలకు గుండె ఆపరేషన్లు చేయిస్తూ.. హార్ట్ ఉన్న హీరో అనిపించుకున్నారు.
సూపర్ ప్టార్ కృష్ణ మరణం అంచున ఆసుపత్రిలో ఉన్నా కూడా.. సేవ చేయడం మాత్రం ఆపలేదు ప్రిన్స్ మహేశ్ బాబు. ఓ పక్క తండ్రిని దగ్గరుండి చూసుకుంటూనే… తన ఛారిటీ ఫౌండేషన్ ద్వారా ఓ చిన్నారి గుండెకు ప్రాణం పోశారు. ఆ చిన్నారి కుంటుంబానికి దేవుడిగా మారిపోయారు. మహేష్ ఫౌండేషన్ పేరుతో ఇప్పటికే చాలా మంది చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయించిన మహేష్.. తండ్రి ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య ఉన్నా కూడా.. తన మానవత్వాన్ని వదిలిపెట్టలేదు. అప్పటికే మోక్షిత్ సాయి అనే చిన్నోడి హృదయ సమస్య గురించి తెలుసుకున్న మహేశ్.. ఆంధ్ర ఆస్పత్రిలో ఆ చిన్నారికి గుండె ఆపరేషన్‌కు కూడా ఏర్పాట్లు చేశారు.
ఓ పక్క తండ్రి ఆరోగ్యంపై ఆందోళన చెందుతూనే.. మరో పక్క.. ఆ చిన్నారికి ప్రాణం పోయే ప్రయత్నాన్ని చేశారు. తన తండ్రిని దక్కించుకోలేక పోయినా.. ఆ చిన్నారికి నూరేళ్ల ఆయుష్షు పోశారు. ఆ కుటుంబానికి దేవుడయ్యారు. అందరూ మరోసారి చేతులెత్తి దండం పెట్టేలా చేసుకున్నారు. దీంతో దైవం మనుష్య రూపేణా అని మహేశ్‌ను తెగ పొగేడుస్తున్నారు అభిమానులు.
దైవం మనుష్య రూపేణా #MBforSavingHearts ❤️@urstrulyMahesh #MaheshBabu pic.twitter.com/n63HnYUBJG
— BA Raju’s Team (@baraju_SuperHit) November 18, 2022