
సర్రా.. సర్రా.. మంటూ.. ఎర్రని ఎండు మిరపకాయలా.. మన ముందుకు వచ్చిన సూపర్ స్టార్ మహేష్ బాబు.. తన పవర్ ఏంటో చూపించారు. నషాలానికి అంటే కారం మజా ఏంటో.. ఖాళీ తన వాకింగ్‌తోనే చూపించేశారు. అడిషియనల్‌గా యాడ్ అయిన బీడీ స్వాగ్‌తో.. అందర్నీ అరిపించేసి ఇప్పుడు ఏకంగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోనే ఆల్ టైం రికార్డ్‌ను తన పేరు మీద రాసేసుకున్నారు. అందరూ అనుకున్నట్టే.. నెట్టింట మహేష్ ఫ్యాన్స్ బల్లగుద్ది మరీ చెబుతున్నట్టే గుంటూరు కారంగా వచ్చిన మహేష్ బాబు ఆల్ టైం రికార్డును క్రియేట్ చేశారు. త్రివిక్రమ్ డైరెక్షన్లో.. తాను చేస్తున్న మూవీ టైటిల్ గ్లింప్స్‌తోనే.. 25 మిలియన్ వ్యూస్ వచ్చేలా చేసుకున్నారు మన సూపర్ స్టార్.
ఇక జెస్ట్ 24 గంటల్లోనే.. వన్ మినెట్ ఫైవ్ సెకండ్స్ టీజర్‌తో.. యూట్యూబ్‌లో 25 మిలియన్ వ్యూస్ వచ్చేలా చేసుకున్న మహేష్ ఇప్పుడు త్రూ అవుట్ సోషల్ మీడియా నెంబర్ 1గా ట్రెండ్ అవుతున్నారు. తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్‌ను కాలర్ ఎగరేసేలా చేస్తున్నారు.
ఇక ఇదే విషయాన్ని ఈ మూవీ మేకర్స్ అయిన హారికా హాసిని క్రియేషన్స్ తన సోషల్ మీడియాలో హ్యాండిల్స్‌లో షేర్ చేసుకుంది. 25 మిలియన్ ప్లస్ వ్యూస్ ఇన్ జెస్ట్ 24 హవర్స్. ఇట్స్ ఏ ఆల్ టైం రికార్డ్ .. అని ఓ ట్వీట్ చేసింది. గుంటూరు కారం నుంచి వచ్చిన మాస్ స్ట్రైక్ ఒక విధ్వంసం సృష్టించింది అని తన ట్వీట్‌లో కోట్ చేసి.. నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
??? ???? ?????? ?⚡
?? ???????+ Real-time Views in just ?? hours ?
The Highly Inflammable MASS STRIKE from #GunturKaaram ? created a BLAST ❤️??
???????? #? ▶️ https://t.co/HxmnoVf4jG#SSMB28MassStrike Super ? @urstrulyMahesh #Trivikram… pic.twitter.com/RVt7ZkrU9L
— Haarika & Hassine Creations (@haarikahassine) June 1, 2023